14 November 2010

రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు

రేపే లోకం ముగిసే నంటే చెలియా ఏం చేస్తావు ||2||
కన్నులు తెరిచి కాలంమరిచి నింగినే కన్నులు నింపుకుని
ముందుకు ఒరిగే ఆఖరిసారిగా ప్రేమగా భువికే పొత్తులిచ్చే
నా ఆయువు నీకే ఇమ్మని అంటూ ఆ దేవుడిని వేడుకుంటాలే ||రేపే||

రేపేలోకం రేపేలోకం ముగిసేనంటే నువు ఏం చేస్తావ్‌
ఒక నూరేళ్ళ జీవితమంతా ఈనాడే జీవిస్తా
నీ పెదవులపైన పెదవులు చేర్చి కన్నులేమూసుకుంటా
మరణం వరకూ మమతులు పంచి మరణాన్నే మరిపిస్తాలే ||రేపే||

వలపు అనేది నిలిచెవరరు భూలోకం ముగియదులే
కోటి మెరుపులు కోసేస్తున్నా ఆగదూ చెల్లదులే
ప్రణయాలెన్నో రాలిపోనీ జీవన యానం సొగునులే
తనువే మైనా మనమేమైనా అనురాగం ఆగదులే
రేపేలోకం ముగిసేనంటే ప్రియా ఏం చేస్తావు ||2||
నింగికి నేలకి వందన మంటూ నిను నాఒడిలో చేర్చుకుంటా
వెన్నెల విరుల పానుపువేసి నాలో నిన్నే నిలుపుకుంటా
నాలో ఊపిరి ఉన్నంత వరకూ నీ కావలినై నిలిచివుంటానే ||రేపే||

No comments: