17 November 2010

గోపాలబాలకృష్ణ గోకులాష్టమి ఆబాలగోపాల

గోపాలబాలకృష్ణ గోకులాష్టమి ఆబాలగోపాల పుణ్యాల పున్నమి
ముకుంద పదముల ముగ్గుల ఇల్లే బృందావని,
నంద నందనుడు నడచిన చోటే నవనందనవని
గోపికాప్రియం కృష్ణహరే నమోకోమల హృదయ కృష్ణహరే
వేవేల రూపాల వేదహరే నమో వేదాంతి విద్య కృష్ణహరే ||2||
ఆ గోవిందుడె కోక చుట్టి, గోపెమ్మ వేషం కట్టి, మంగోలచేతబట్టి
వచ్చెనమ్మా, నవ మోమన జీవన వరమిచ్చెనమ్మా ||2||
ఇకపై ఇంకెపుడు నీ చేయి విడిచి వెళ్ళనని చేతిలో చెయ్యేసి ఒట్టేసెనమ్మా
దేవకి వసుదేవ పుత్ర హరే నమో పద్మపత్ర నిద్ర కృష్ణహరే
యజకుల నందన కృష్ణహరే నమో యశోద నందన కృష్ణహరే ||2||

ఎన్నాళ్ళకు, ఎన్నాళ్ళకు, ఎన్నాళ్ళకు, ఎన్నాళ్ళకు వెన్నుడొచ్చెనమ్మా
ఎన్నెన్నో చుక్కల్లో నన్ను మెచ్చెనమ్మ
వెన్నపాలు ఆరగించి విన్నపాలు మన్నించి ||2||
కష్టాల కడలి పసిడి పడకాయెనమ్మ కళ్యాణరాగ మురళి కలలు చిలికెనమ్మ
మా కాపురాన మంచి మలుపు తిప్పెనమ్మ
వసుదైక కుటుంబమని గీత చెప్పెనమ్మ
గోవర్ధనోద్దార కృష్ణహరే నమో గోపాల భూపాల కృష్ణహరే
గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణహరే ||2|| ||గోవిందుడె కోక||

తప్పటడుగు తాండవాలు చేసినాడమ్మా
తన అడుగులు ముగ్గులు చూసి మురిసినాడమ్మా
మన అడుగున అడుగేసి, మనతోనే చిందేసి ||2||
మన తప్పటడుగులు సరిదిద్దినాడమ్మా
కంసారి సంసారిని కలిపి మెరిసెనమ్మా
కలకాల భాగ్యాలు కలిసి వచ్చెనమ్మ
హరిపాదం లేని చోటు మరుభూయేనమ్మా
శ్రీ పాదం ఉన్న చోట సిరులు విరియునమ్మ
ఆపద్దోద్ధారక కృష్ణహరే నమో ఆనంద వర్ధక కృష్ణహరే
లీలా మానుష కృష్ణహరే నమో తాండవినాశ కృష్ణహరే ||2||
గోవింద గోవింద కృష్ణ హరే నమో గోపిక వల్లభ కృష్ణహరే
గోవర్ధనోద్ధార కృష్ణ హరే నమో గోపాల భూపాల కృష్ణహరే ||2||

No comments: