17 November 2010

కొత్త పెళ్ళికూతురా రారా

కొత్త పెళ్ళికూతురా రారా
నీ కుడికాలు ముందు మోపి రారా
గణపతి కులసతి రారా
నువు కోరుకున్న కోవెలకు రారా ||కొత్త||

కలిమికి కాణాచి నీ పుట్టినిల్లు
చెలిమికి మాగాణి నువు మెట్టినిల్లు ||2||
ధనమున్నది బలమున్నది నీ ఇంటా ||2||
మనసున్నది మమతున్నది మా ఇంట ||కొత్త||

పై మొరుగులు పైడి నగలు లేవు ఇక్కడ
పంతాలు సాధింపులు రావు ఇక్కడ ||2||
నిండు మనసు చిరునగవు పండునిక్కడ ||2||
ఆ పండు వెన్నెలందు దినం పండుగిక్కడ ||కొత్త||

కన్నతల్లి కన్నమిన్న మీ అత్తగారు
కనిపించే దైవము చేకొన్న వాడు ||2||
కలలన్నీ నిజమౌ నీ కాపురానా ||2||
కలకాలం వెలుగు నీ ఇంటి దీపము ||కొత్త||

No comments: