14 November 2010

బియస్సీ అయినాగాని ఎమ్మెస్సీ అయినాగాని

గిల్లేలే గిల్లల్లేరే గిల్లల్లేరే గిల్లల్లేరే
బియస్సీ అయినాగాని ఎమ్మెస్సీ అయినాగాని
యస్సెస్సి అయినాగాని పియుసి అయినాగాని
ఏదీకాని ఈజీగాని ఆంధ్రాగాని ఆగ్రా గాని
స్టూడెంట్స్ లైఫ్ చాలా జాలీ రమ్మన్న రాదండి మళ్లీ
స్టూడెంట్స్ లైఫ్ చాలా జాలీ వుండదు క్షణమైన ఖాళీ
ఓరోరీ సహోదరా హంగామా నీదిరా ||2||

డాడీ జేబులో డబ్బులు తీసి డాబా కెళ్లొచ్చు
మమ్మీ పర్సుని మాయంచేసి మూవీ చూడొచ్చు
బెడ్‌రూం నిండా పోస్టర్లెన్నో అతికించవచ్చు
వాకింగ్ చూసి వందల ఏళ్లు బతికేయవచ్చు
తోచిందేదో తప్పుయినా చేసేయ్యోచ్చు
తమ్ముడికేమొ యమ నీతులు బోధించొచ్చు ||స్టూడెంట్స్||

పీలగా వున్న పిల్లను నువ్వు పిన్ని అనవచ్చు
బొద్దుగా వున్న భామను నువ్వు భామా అనవచ్చు
ఎత్తుగ వుంటే అక్కా అంటూ వరసే కలపొచ్చు
పొట్టిగా వుంటే పాపా అంటూ పాప్‌ కార్నివ్వచ్చు
అందంగుంటే నువ్వు అడ్వాన్సయిపోవచ్చు
పెళ్లి అంటే నువ్వు ప్లేటే తిప్పెయ్యెచ్చు హే ||స్టూడెంట్సు|| ||బియస్సీ||

ఆనందంగా ఎన్నికలల్లో పోటీ చెయ్యొచ్చు
అవతలవాడి బేనర్‌మీద పేడే కొట్టొచ్చు
కొత్తగ వచ్చిన ఫేషన్లన్నీ ఫాలో కావొచ్చు
కోతికి మనకు తేడా లేదని వేచేయవచ్చు
మంత్రులు పోతే సంతాపం తెలిపైయొచ్చు
ఆ తరువాత హాలీడే మనకేవచ్చు ||స్టూడెంట్స్|| ||బియస్సీ||

ముప్పయి మార్కులు వస్తే నువ్వు ఓకే అనవచ్చు
నలభైగాని వచ్చాయంటే పాకే తినవచ్చు
యాభైవస్తే ప్లేబోయ్‌లాగా ఫోజే కొట్టొచ్చు
అరవై వస్తే ఆలిండియానే అమ్మేయవచ్చు
డబ్బయి వస్తే నువ్వు అబ్బుర పడిపోవచ్చు
డౌటే లేక హార్ట్ ఫెయిలై పోనువచ్చు ||స్టూడెంట్స్|| ||బియస్సీ||

No comments: