15 November 2010

కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి

కొంతకాలం కొంతకాలం కాలమాగిపోవాలి
నిన్నకాలం మొన్నకాలం రేపుకూడా రావాలి ||2||
ఎంతకాలం ఎంతకాలం హద్దు మీరకుండాలి
అంతకాలం అంతకాలం ఈడునెక్కడాపాలి ||కొంతకాలం||

గుండె విరహములో మండే వేసవిలో నువ్వే శీతాకాలం
కోరే ఈ చలికి ఊరే ఆకలికి నువ్వే ఎండకాలం
మధనుడికి పిలుపు మలెకాలం మదిలోనె నిలుపు ఎల్లకాలం
చెలరేగు వలపు చెరికాలం కలనైన మెరుపు కలికాలం
కలిగిలి కాలం కౌగిలి కాలం మనకాలం ఇది ||కొంతకాలం||

కన్నె మోజులకు సన్నజాజులకు కరిగే జాముకాలం
గుచ్చె చూపులకు గిచ్చెకైపులకు వచ్చే ప్రేమకాలం
కామి తేరకుంది తడికాలం క్షణమాగ నంది ఒడికాలం
పొడిగింది సిగ్గు తొలికాలం నలిగింది మనస్సు మలికాలం
మరి సిరి కాలం మగసిరి కాలం మనకాలం కధ ||కొంతకాలం||

No comments: