చిలకమ్మ పలికిందీ..చిగురాకు కులికిందీ ||2||
చిరునవ్వు చిలికించవే నీ లేత సింగారమొలికించవే..
నీ లేత సింగార మొలికించవే..
గోరొంక కూసింది..గోరింట పూసిందీ..
ముత్యాల మనసీయ రా నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా...
నీ తీపి ముద్దుల్లో ముంచెయ్యరా...
పాల బుగ్గ కందితే తెలిసిందీ పూల సిగ్గు పూచిందనీ...
ఆ ఆహాహహాఆహ
పైట కొంగు జారితే తెలిసిందీ పిల్ల గాలి వీచిందనీ..
ఈ సిగ్గు బరువు నేనోపలేను ||2||
నీ కంటి పాపలో దాచుకో నన్నూ.. దాచుకో నన్నూ..
||చిలకమ్మ||
కోయిలమ్మ పాడితే తెలిసిందీ కొత్త ఋతువు వచ్చిందనీ...
ఆ ఆహాహహాఆహ
కొండ వాగుదూకితే తెలిసిందీ.. కోడె వయసు పోగిందనీ..
ఈ వయసు హోరు నేనాపలేను ||2||
నీ కౌగిలింతలో దోచుకో నన్నూ...దోచుకో నన్నూ..
||చిలకమ్మ||
No comments:
Post a Comment