తుర్ర్ర్ర్..........
పారిపోకే పిట్టా....... చేరనంటే ఎట్టా
పారిపోకే పిట్టా....... చేరనంటే ఎట్టా
అంత మారాం ఎంటంటా మాట వినకుండా
సరదాగా అడిగాక మజిలి చేర్చవా
తీసుకుపో నీ వెంటా
వస్తా తీసుకుపో నీ వెంటా
నా సంతోషాన్నంతా పంపించా తనవెంట
భద్రంగానే ఉందా ఏ బెంగా పడకుండా
తన అందెలుగా తొడిగా నా చిందర వందర సరదా
ఆడిస్తూనే ఉందా రోజంతా సందడిగా
చిన బోయిందేమో చెలికొమ్మ
ఆ గుండెల గూటికి ముందే కబురీయవె చిలకమ్మా
నీ వాడు వస్తాడే ప్రేమ
అని నువ్విన్న కథలన్ని చెప్పమ్మా కాకమ్మా
తీసుకుపో నీ వెంటా
వస్తా తీసుకుపో నీ వెంటా
ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది
అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది
నిద్దర ఎదురయ్యింది తెగ చిరాగ్గ ఉన్నట్టుంది
తన వద్దకు రావద్దంటూ తరిమేసావంటోంది
ఏం గారం చేస్తావే ప్రేమ
నువ్వడిగిందంటూ ఇవ్వని వాళ్ళెవరున్నారమ్మా
ఆ సంగతి నీకు తెలుసమ్మా
నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా
తీసుకుపో నీ వెంటా
వస్తా తీసుకుపో నీ వెంటా
No comments:
Post a Comment