మనసున ఉన్నది చెప్పేది కాదది మాటున దాచేదెలా
మనదనుకున్నది చేజారిందని నమ్మకపోతే ఎలా
మరి మరి తలచి ఊహలలోనే దాచి చాటుగ చూసేదెలా
తగదని తెలిసి తలపే ఆపలేని తప్పును చేసేదెలా
ఇకనైనా చెదరాలి చల్లని నీళ్ళలా నను వెంటాడే కలా ||మనసున ఉన్నది||
నేలకందించి ఆకాశగంగని నింగి గుండెల్లో నలుపు కడగని
కురిసే చల్లని వాన నీటితో
కళ్ళముందున్న సత్యాన్ని చూపని రెప్ప చాటున్న నిదుర కరగని
ఉబికే వెచ్చటి కన్నీటితో
అందిస్తున్నా నా ప్రియమైన నీకు అక్షింతలుగా నా ప్రతి ఆశని
కలకాలం నీ నవ్వై నిను నడిపించనీ.....
నను వెంటాడే కలా ||మనసున ఉన్నది||
నన్ను రమ్మన్న చెలిమి వెన్నెల దాటిరానంది చీకటి కాపలా
ఇకపై తెరలను తీసేదెలా
నిన్ను నిన్నలో ఆపిన నిజమిల జ్ఞాపకాలతొ అల్లింది సంకెల
గతమే శిలువగ మోసేదెలా
ఇచ్చేస్తున్నా నా ప్రియమైన నీకు నీకై వెతికిన నా ప్రతి శ్వాసని
నిను చేరి సిగపువ్వై కొలువై ఉండనీ....
నను వెంటాడే కలా ||మనసున ఉన్నది||
No comments:
Post a Comment