14 June 2010

ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్తపిచ్చి

||పల్లవి||
ఏమయిందో ఏమో ఈ వేళ రేగింది గుండెలో కొత్తపిచ్చి
ఎంతవింతో నా గుండీవేళ ఊగింది గాలిలో రెక్కలొచ్చి
న్యూటన్ థియరి.... తల్ల కిందులై..... తప్పుతున్నదా భూమికి ఆకర్షణ
తారానగరి...... కళ్ళవిందులై...... చూపుతున్నదా ప్రేమకున్న ఆకర్షణ

||చరణం 1||
వెతకాలా వైకుంఠం కోసం అంతరిక్షం వెనకాల.......
ప్రియురాలే నీ సొంతం ఐతే అంత కష్టం మనకేల......
ప్రతి కలని చిటికెలతో పిలిచే సమయాలా
జతవలలో ఋతువులనే పట్టే ప్రణయాలా
ముల్లోకాలు గుప్పిట్లోనె చిక్కవా.....
స్వర్గం తానే వొళ్ళో వచ్చి పడదా......

||చరణం 2||
చెలులారా ఒట్టేసి చెబుతా నమ్ముతారా నా మాట.....
మనసారా ప్రేమించి చూస్తే అమృతం అందేనంట......
మిస్ లైలా మిస్సైలా స్మైలే విసిరిందా
అది తగిలి కునుకొదిలి మతిచెడి పోయిందా
హద్దేకాగా లవ్లో లవ్లీ లీల.....
అయ్యా నేనే ఇక మజ్ఞూలా......

No comments: