14 June 2010

ఎంత పంచేసిందీ ప్రేమ

ఎంత పంచేసిందీ ప్రేమ
ఆశ పెట్టేస్తె అల్లాడిపోమా
వెంట రమ్మన్నదంటె ఎందుకని అంటామా..... హాయ్‌రామా
జంటకమ్మన్నదంటె ముందు వెనుక చూస్తామా... సై అనమా
కళ్ళల్లో కలలకోమా
గుండెల్లో కొండంత ధీమా
కవ్విస్తే కిర్రెక్కిపోమా... హొయ్ హొయ్ హొయ్ హొయ్
మబ్బుల్లో తేలే ప్రయాణం చెద్దామా
ముత్తుల్లో ముంచే ఆనందం చూద్దామా ||ఎంత పంచేసిందీ||

విన్నానులే పాలు వెన్న కాజేసే ఘనకార్యం
విన్నమాట కల్ల కాదు అంటు నన్ను కొల్లగొట్టె నీ చౌర్యం
అందర్లాగే నువ్వూ ఇలా నిందిస్తే ఏం న్యాయం
నన్నుకూడ దోచుకుంది కద నీ మాయదారి పైటప్రాయం
ముద్దైన ఇద్దరి నేరం వద్దంది ఏ నిష్టూరం
ముద్దైన ఇద్దరి నేరం వద్దంది ఏ నిష్టూరం
ఎందుకింక ఈ కాస్తదూరం
గుట్టుగా రాజికొద్దామా ఓ భామా
కౌగిలిలొ లోకం అందామా చెప్పమ్మా ||ఎంత పంచేసిందీ||

నువ్వు నేను పుట్టకముందే రాసుంది ఈ బంధం
జన్మ ముళ్ళు పడ్డ బ్రమ్హరాత ఇది మార్చలేదు ఏ పంతం
యూగాలెన్నో చెప్పాయిగా గుళ్ళో మన పురాణం
మర్మమేమిటంటె మాధవయ్యతోనె రుక్మిణమ్మ కళ్యాణం
ఎర్రబడ్డ కళ్ళెన్నైనా మిర్రి మిర్రి చూస్తు ఉన్నా
ఎర్రబడ్డ కళ్ళెన్నైనా మిర్రి మిర్రి చూస్తు ఉన్నా
ఎత్తికెళ్ళిపోతానె జాణా
అందుకే సిద్ధంగా ఉంది నీ బొమ్మ
ముందుగా ముస్తాబయ్యింది చూడమ్మా ||ఎంత పంచేసిందీ||

No comments: