22 June 2010

నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదుర లేచెనెందుకో

నిన్నలేని అందమేదో నిదురలేచెనెందుకో నిదుర లేచెనెందుకో
తెలియరాని రాగమేదో తీయ సాగెనెందుకో నాలో...

పూచిన ప్రతి తరువొక వధువూ
పువుపువ్వున పొంగెను మధువు

ఇన్నాళ్ళీ శోభలన్నీ ఎచట దాగెనో || నిన్న లేని ||

తెలి నురుగులె నవ్వులుకాగా
సెలయేరులు కులుకుతు రాగా
కనిపించని వీణలేవో కదలి మ్రోగెనే || నిన్న లేని ||

పసిడి అంచు పైట జార
పయనించే మేఘ బాల
అరుణ కాంతి సోకగానే పరవశించెనే || నిన్న లేని ||

No comments: