ఓ ప్రియతమా...ప్రియతమా...ప్రియతమా....
నా మది నిన్ను పిలిచింది గానమై
వేణు గానమై నా ప్రాణమై
యెవ్వరివో నీవు నేనెరుగలేను
ఏపేరున నిన్ను నేపిలువగలను(2)
తలపులలోనే నిలిచేవు నీవే(2)
తొలకరి మెరుపుల రూపమై || నా మది..||
యెన్ని యుగాలని నీకొరకు వేచేను
ఈ మూగ బాధ ఎందాక దాచేను(2)
వేచిన మదినే వెలిగింప రావే(2)
ఆరని అనురాగ దీపమై || నా మది..||
No comments:
Post a Comment