03 June 2010

తళ తళ తారకలాగ మెరుపుల మాలికలాగ

తళ తళ తారకలాగ మెరుపుల మాలికలాగ
కరునించ వచ్చావే సిరులెన్నో తెచ్చావే కులుకా...ఆ..
పంచవన్నెల రామచిలుకా నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
పంచవన్నెల రామచిలుకా పంచదారల ప్రేమ చినుకా

మాణిక్యవీణవు నువ్వే మలిసంధ్య వేణువు నువ్వే
నా మనసు మందిరాన మోగుతున్న అందమైన అందెవునువ్వే
ఆరాధ్యదేవత నువ్వే గంధర్వ కాంతవు నువ్వే
స్వర్గాలదారిలోన నీడనిచ్చు పాలరాతి మేడవు నువ్వే
నీ గాలి సోకిందీ నా కొమ్మ ఊగిందీ
నీ ప్రేమ లాగింది నా జన్మ పొంగిందీ

పంచవన్నెల రామచిలుకా నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
పంచవన్నెల రామచిలుకా పంచదారల ప్రేమ చినుకా

నా తేనె బిందువు నువ్వే నా లంకె బిందెవు నువ్వే
నా గుండె గంపలోన ఒంపుతున్న అంతులేని సంపద నువ్వే
నా పొద్దు పొడుపువు నువ్వే నా భక్తి శ్రధ్ధవు నువ్వే
చిననాడు దిద్దుకున్న ఒద్దికైన ఓనమాలు నువ్వే నువ్వే
నీ చూపు అందింది నా చెంప కందిందీ
నీ మెరుపు తెలిసింది నా వలపు కురిసిందీ

పంచవన్నెల రామచిలుకా నిధిలాగ దొరికావే తళుకా తళుకా
వదిలేసి పోమాకే మొలకా మొలకా
పంచవన్నెల రామచిలుకా పంచదారల ప్రేమ చినుకా

No comments: