03 June 2010

జాబిల్లీ సీమనుండి జారిపడ్డ జాజిపువ్వు ఈప్రేమా

జాబిల్లీ సీమనుండి జారిపడ్డ జాజిపువ్వు ఈప్రేమా
పాలకడలి చిలికినపుడు పైకొచ్చిన వెన్నముద్ద ఈ ప్రేమా
ఆకాశం కోకిలమ్మ ఆలపించు పంచమం ఈ ప్రేమా
చైత్రమధుర చందనాల చిందులాడు సందె గాలి ఈ ప్రేమా
అమృత జలపాతాలే అవని పైకి తుళ్ళిపడే నవరత్నగిరి శిఖరం ఈ ప్రేమా


విచ్చుకున్న వయసుతోట వసంతం ఈ ప్రేమా
ఇచ్చుకున్న కొద్ది పుట్టు అనంతం ఈ ప్రేమా
వెనక అడుగు వేయకుంటే సుఖాంతం ఈ ప్రేమా
పేదవారి గొప్పవారి ప్రశాంతం ఈ ప్రేమా
గుండెలోంచి పొంగుకొచ్చి నవ్వుతోటి మద్దతిచ్చి
కళ్ళలోంచి దూసుకొచ్చె ఈ ప్రేమా
మనసు మనసు ఒకటి చేసి మరువలేని మమతలిచ్చి
మౌనరాగమంత్రమేసె ఈ ప్రేమ
సాహసాల సంగమం ఈ ప్రేమా
సత్యం శివం సుందరం ఈ ప్రేమా

అడ్డుకట్ట వేయలేని ప్రవాహం ఈ ప్రేమా
అందమైన సృష్టిలోని తియ్యదనం ఈ ప్రేమా
నింగి నేల మారుమ్రోగు సంగీతం ఈ ప్రేమా
అంతులేని ఆనందం చిరునామా ఈ ప్రేమా
వేల వేల సాగరాలు గొంతువిప్పి ఆలపించు
విశ్వశాంతి వేద ఘోష ఈ ప్రేమా
రంగులీను సంధ్యవేళ రమ్యమైన రాత్రివేళ
కథలు చెప్పు కాంతి భాష ఈ ప్రేమా
సరస మధుర స్పందనం ఈ ప్రేమా
నంద నంద నందనం ఈ ప్రేమా

No comments: