14 June 2010

వారెవ్వా ఏమి ఫేసు

వారెవ్వా ఏమి ఫేసు... అచ్చు హీరోలా ఉంది బాసు...
వచ్చింది సినిమా చాన్సు... ఇంక వేసేయి మరో డోసు...
వారెవ్వా ఏమి ఫేసు... అచ్చు హీరోలా ఉంది బాసు...
వచ్చింది సినిమా చాన్సు... ఇంక వేసేయి మరో డోసు...
పిచ్చెక్కి ఆడియన్సు రెచ్చిపోయేలా చెయ్యి డాన్సు..
చెప్పింది చెయ్య రా నీవే రా ముందు డేసు..

||వారెవ్వ||

అమితాబచ్చను కన్నా ఏం తక్కువ నువ్వైనా..
హాలీవుడ్ లో అయినా ఎవరెక్కువ నీకన్నా..
ఫైటూ ఫీటూ ఆటా పాటా రావా నీకైనా
చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా
తెగించి సత్తా చూపందే సడన్ గా స్వర్గం రాదయ్యా
బాలయ్య వెంకటేషు నాగార్జునా నరేషూ
రాజేంద్రుడూ సురేషూ రాజశేఖరు అదర్సూ
మొత్తంగా అందరూ అయిపోవాలోయ్ మటాషూ..

||వారెవ్వ||

గూండా రౌడీ దాదా అంటారే బయటుంటే..
ఇక్కడ చేసే పన్లే సినిమాల్లో చూపిస్తే..
ఓహో అంటూ జై కొడతారు తేడా మేకప్పే...
నువ్వుంటే చాల్లే అంటారు కధెందుకు పోన్లే అంటారు
కటౌట్లూ గట్రా కడతారు టికట్లకు కొట్టుకు చస్తారు
బావుంది కానీ ప్లాను పల్టీ కొట్టిందో ఏమి గాను
బేకారీ బాత్ మాను జర గారు తగ్గించు ఖాను
అరె చుప్ హో.. శకున పక్షి లా తగులుకోకు ముందు

||వారెవ్వ||

No comments: