14 June 2010

కన్నెత్తి చూడకే కణ్యామణి..పన్నెత్తి చెప్పకే ఏ మాటని

కన్నెత్తి చూడకే కణ్యామణి..పన్నెత్తి చెప్పకే ఏ మాటని
నేనంటే కొద్దిగా ఇదుందనీ..నాక్కూడా తెలుసునుగానీ
ఛీ కొట్టి పొమ్మనే అమ్మాయిని..చేపట్టగలిగే దమ్ముందనీ
నా పట్టుదలనే చూపెట్టి..నిన్ను ఆకట్టుకుంటా రాణీ
అందుకే అందుకే అంత సులువుగ భామా
ఆటవో వేటవో అంతు తెలియని ప్రేమా...

I dont wanna love..you don't care now
but i won't leave..let me show how..

I dont wanna love..you don't care now
but i won't leave..let me show how..

కన్నెత్తి చూడకే కణ్యామణి..పన్నెత్తి చెప్పకే ఏ మాటని
నేనంటే కొద్దిగా ఇదుందనీ..నాక్కూడా తెలుసునుగానీ

రోజా పువ్వోటందించి I L U అంటే..నాజూగ్గా నువ్ స్పందించి I Too అనవద్దే
దీనంగా దే దే అంటూ దానం ఇమ్మంటే..పోనీలే లే లే అంటూ దిల్లిస్తావంటే
వలపునైనా..గెలుపునైనా..కోరుకుంటే చాలదే..ప్రాణమైనా పందెమేసి కోరకుంటే నచ్చదే

I dont wanna love..you don't care now
but i won't leave..let me show how..

I dont wanna love..you don't care now
but i won't leave..let me show how..

జుట్టంతా పీక్కునేంత పిచ్చెక్కించందే..ఇట్టే చేజిక్కావంటే ఏం బావుంటుందే
రిస్క్ అంటే ఏం లేకుంటే ఇష్కైనా చేదే..లక్కెళ్లి లాక్కొచ్చేస్తే కిక్కేం ఉంటుందే
నా దారి కాదే...నా తీరు కాదే..టేక్ ఇట్ ఈసీ పాలసీ
నా తిక్క నాదే..నా లెక్క నాదే..సాధిస్తా ఏదో ప్లానేసి

I dont wanna love..you don't care now
but i won't leave..let me show how..

I dont wanna love..you don't care now
but i won't leave..let me show how..

No comments: