05 July 2010

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
వెంట వెంట వచ్చే వారి పేరు చెప్పవే
ఎవరే ఎవరే పిలిచేది నేనెట్టా ఎట్టా పలికేది
బుల్లిపిట్ట బుజ్జిపిట్ట గూటిలోని గువ్వపిట్ట
నక్కి నక్కి దాగేవారి పేరు చెప్పవే
ఎవరో ఎవరో తెలియందే
నేనెట్టా ఎట్టా పిలిచేది ||బుల్లిపిట్ట||

కొంటె కోణంగి ఈడు కొట్టే కేరింత చూడు
ఏదో గమ్మత్తుగుంది మావా
లేనే లేదంటు హద్దు
ముద్దుముద్దుకి పద్దు రాస్తే ఎట్టా సత్యభామా
బంగారు గిన్నెలోని పరువాల పాయసాలు
నీకే వుంచా నేను పోకిరి
చక్కంగా ముందుకొచ్చి సందేళ విందులిచ్చి
కాదంటానా జత రా మరి
వారం వర్జ్యం చూడాలి ఆపైనే నీతో ఓడాలి ||బుల్లిపిట్ట||

ఇంటి తాళాలు దాచి గంట మోగించమంటే
ఎట్టాగమ్మో గౌరమ్మో
జంటా బాణాలు దూసి ఇట్టా రెట్టిస్తే నన్ను
వేగేదెట్టా మావయ్యో
గోరింక గూటిముందు చిలకమ్మ చిందులేసి
ఆడిందంటే అర్ధమేవిటో
మందారపువ్వు మీద మురిపాల తుమ్మెదొచ్చి
వాలిందంటే మరి దేనికో
నీలో నేనే దాగాలి చెలరేగే తాపం తీరాలి ||బుల్లిపిట్ట||

No comments: