10 July 2010

ఆకాశం మెరిసెను మెరిసెను..

ఆకాశం మెరిసెను మెరిసెను.. ఆ మెఘం కరిగెను కరిగెను...
ఆనందం చిట పట చినుకై చిందులు వేస్తుంటే..
ముద్దొచ్చే బుడి బుడి నడకలు..మురిపించే కిల కిల నవ్వులు..
నీ బాల్యం గుర్తొస్తుందా...తననే చూస్తుంటే...
ఆ దేవుడు వేసిన బంధం మీ ఇద్దరిదంటావా...
నీ ఒడినే ఊయల చేసి జోలనే పాడవా...

||ఆకాశం||

ఆ.. దిగులుగ తను ఉంటే.. ధైర్యం అవుతావా...
చెదిరిన ఆశలకే.. రెక్కలు కడతావా...
తన కనులకే కొత్త లోకాన్నీ...
నువ్వు చెలిమి తో చూపుతావా...
అడుగడుగునా పంచి ఇస్తావా...ప్రే..మంతా..
ఆఅ...ఆ...ఆఅ...ఆ...ఆ...

||ఆకాశం||

ఆఅ...ఆ...ఆఅ...ఆ...ఆ...
నిన్నటి దాకా మీరూ... ఒకరికి ఒకరేం కారు...
చెలిమే కుదిరెను నేడూ... చెదరదు గా ఏనాడూ...
తన బరువూ..హొయ్... బాధ్యతలూ...హొయ్...
మోయడమే ఇక నీ పని అనుకొని...
అమ్మై ఆదరిస్తావా... నాన్నై నీడ నిస్తావా...
అన్నీ నేర్పుకుంటావా..నూరేళ్ళూ ఇలా....
ఆఅ...ఆ...ఆఅ...ఆ...ఆ...

||ఆకాశం||

No comments: