20 July 2010

కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు

పల్లవి:

కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు

చరణం1:

కుమ్మరదాసుడైన కురువరత్తనంబి
ఇమ్మన్న వరములన్ని ఇచ్చినవాడు
దొమ్ములు చేసినయెట్టి తొండమాన్ చక్కురవర్తి
దొమ్ములు చేసినయెట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు
కొండ్లలో నెలకొన్న గమదనిసగమాగసనిదగమస
కొండ్లలో నెలకొన్న సగసదమగనిమగదమనిసమగదదమగస
కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు

చరణం2:

ఎదలోని శ్రీసతి ఎపుడో ఎడబాటు కాగ
ఎనలేని వేదనలో రగిలినవాడు
మనసిచ్చి పరిణయమాడిన సతి పద్మావతి
మమతలకోవెలలో మసలనివాడు
నీతికి నిలిచినవాడు దోషిగ మారెను నేడు
ప్రేమకి ప్రాణంవాడు శిక్షకు పాత్రుడుకాడు
ఆర్తరక్షక శ్రీవెంకటేశ్వర కరుణతో
తోడునీడై వాణ్ణి కాపాడు నేడు

కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు
కొండలంత వరములు గుప్పెడువాడు
కొండ్లలో నెలకొన్న కోనేటిరాయడువాడు

No comments: