07 July 2010

ముద్దు ముద్దు రోజావే

ముద్దు ముద్దు రోజావే ముద్దులొలుకు రోజావే
ముద్దు ముద్దు రోజావే ముద్దులొలుకు రోజావే… ప్రేమ బంధమే నీది
కలలు కన్న రోజావే కలత విడిన రోజావే… వింత బంధమే మనది
నీ ఆరాటం నా సహకారం విధి ఆట ఇదేననుకోనా నేస్తమా
రోజా పువ్వా రోజా రోజా పువ్వా
సొగసరి రోజా పువ్వా వాడని రోజా పువ్వా

దూరానున్నా దూరం తెలియని వలపే ఒక స్వర్గం
పక్కనే ఉన్నా దూరం తరగని బ్రతుకే ఒక నరకం
పెదవులపైనా చిరునవ్వున్నా యదలో ఒక మౌనం
నీ కలలకు నే కావలినయినా నా కలలను నీ కళ్ళల్లో చూడనీ
రోజా పువ్వా రోజా రోజా పువ్వా
సొగసరి రోజా పువ్వా వాడని రోజా పువ్వా

కన్నులలోని నిదురను నీకు కానుకే ఇచ్చేయినా
నాలో ఉన్నా ప్రేమని చెలియా యదలో దాచేయినా
నీకై నాలో ప్రాణం నిలిపి నన్నే మరిచానే
నీ సేవలకే చెలి నేనున్నా నా హృదయంలో నీ స్థానం చెరగదే
రోజా పువ్వా రోజా రోజా పువ్వా
సొగసరి రోజా పువ్వా వాడని రోజా పువ్వా
రోజా పువ్వా రోజా రోజా పువ్వా
సొగసరి రోజా పువ్వా వాడని రోజా పువ్వా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips