07 July 2010

అందమా అందుమా అందనంటే అందమా

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా (2)
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా అందనంటే అందమా

ఆకలుండదే దాహముండదే ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే
ఆగనంటదే దాగనంటదే ఆకుచాటు వేడుక కిర్రెక్కమంటదే
వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి
చిటికనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసిపెట్టి ఉంది గనక నిన్నే నమ్మి
ఊసులన్ని పూస గుచ్చి ఇస్తా సుమీ
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా

వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా లక్ష్యపెట్టదే ఎలా ఇదేమి విలవిల
తియ్య తియ్యగా నచ్చచెప్పనీ చిచ్చికొట్టనీ ఇలా వయారి వెన్నెల
నిలవనీదు నిదరపోదు నారాయణ
వగలమారి వయసుపోరు నా వల్లనా
చిలిపి ఆశ చిటికెలోన తీర్చేయనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా
ఆదుకో నాయనా ఆర్చవా తీర్చవా చింత

అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడి బొమ్మ పారిజాత పూల కొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ

No comments: