20 July 2010

ఇన్ని రాశులయునికీ ఇంతి చెలువపు రాశి

ఇన్ని రాశులయునికీ ఇంతి చెలువపు రాశి
కన్నె నీ రాశి కూటమీ కలిగిన రాశి..ఇంతి చెలువపు రాశి

కలికి బొమవిండుగలా కాంత కు నూ ధను రాశి
వెలయు మీనాక్షికినీ మీన రాశి

కులుకు కుచకుంగములలా కొమ్మకును కుంభ రాశి
వెలుగు హరి మద్యకునూ సిం హ రాశి

చిన్ని మకరాంతపు పైయెద చేడెకు మకర రాశి
కన్నె ప్రాయపు సతి కీ కన్నె రాశి

వన్నె మై పైడి తులదూగు వనితకు తుల రాశి
పింగని వాడి గోళ్ళ సతి కి వృశ్చిక రాశి

ఆముకొని నొరపుల నెరయు నతివకు వ్రిషబ రాశి
గామిడి గుట్టు మాటల సతి కి కర్కట రాశి

కొమలపు చిగురు మోవి కోమలికి మేష రాశి
ప్రేమ వేంకట పతికలిసే ప్రియ మిధున రాశి

No comments: