01 July 2010

ఆదిశంకరుల సౌందర్యలహరి.......

ఆదిశంకరుల సౌందర్యలహరి....... దేవులపల్లి లలిత గీతాఝరి
శ్రీనాధ శృంగారలాహిరి వేటూరి గేయాల మాధురి
నవలా శౌరి యండమూరి షెల్లి కీట్సు యద్దనపూడి
ఎందరో...... మహానుభావులు చూపిన దారి
పట్టాల్సిన పిచ్చే ప్రేమరా.........
పుట్టాల్సిన చిచ్చే ప్రేమరా......
జీవితమే వడబోసి అనుభవమే కలబోసి
ఎందరో...... మహానుభావులు చూపిన దారి
చెయ్యాల్సిన తప్పే ప్రేమరా.........
తెలియాల్సిన నొప్పే ప్రేమరా.........

అందరికి తెల్లారితే సూర్యోదయం
నాకుమాత్రం నిన్ను చూస్తేనే సూర్యోదయం
ఓ..... ఓహో....ముంచుతుంది ప్రేమ అమృత జలపాతంలో
తేల్చుతుంది ప్రేమ ఆకాశంలో......
ఓ..... ఓహో.... మొక్కుతుంది ప్రేమ మమతల తులసిదళంతో
మెక్కుతుంది ప్రేమ తలరాతతో
మనసు పుటల్లో వయసే రాసే రసవద్గీతే ప్రేమ
తలపులతో తలపండి వలపులనే తెగవండి
ఎందరో...... మహానుభావులు చూపిన దారి
తిరగాల్సిన మలుపే ప్రేమరా......
తియ్యాల్సిన తలుపే ప్రేమరా..... ||ఆదిశంకరుల||

ఎదురుగా నువ్వుంటే గుండెదడ పెరుగుతుంది
దూరమైతె ఆగిపోతుందేమో
ఓ..... ఓహో.... ఆడుతుంది ప్రేమ మనసుల మైదానంలో
పొంగుతుంది ప్రేమ మది భావంతో
ఓ..... ఓహో.... పాడుతుంది ప్రేమ ఊపిరి కచ్చేరీతో
పండుతుంది ప్రేమ కస్తూరితో
అడిగినవన్నీ మనకందించే అక్షయపాత్రే ప్రేమ
కవితలనే దివ్వెలుగా భావనలే వెలుగులుగా
ఎందరో...... మహానుభావులు చూపిన దారి
ఎదగాల్సిన ఎత్తే ప్రేమరా......
కలగాల్సిన మత్తే ప్రేమరా...... ||ఆదిశంకరుల||

No comments:

                                                           Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips