06 July 2010

ప్రెమంటె యేమిటంటే నిను ప్రేమించినాక

ప్రెమంటె యేమిటంటే నిను ప్రేమించినాక తెలిసె
మనసంటె యేమిటంటే అది నీకివ్వగానె తెలిసె
ఇది వరకు తెలియంది ఈ అనుభవం
యద మేలుకొలిపింది ఈ పరిచయం
ఒహొ హొ హొ ఒ ఒ
ఒహొ హొ హొ ఒ ఒ

నీ కళ్ళ వాకిళ్ళలో తలుపు తెరిచెను ప్రేమా ప్రేమా
మొహాల ముంగిళ్ళలో వలపు కురిసెను ప్రేమా ప్రేమా
ఈనాడె తెలిసింది తొలిసారిగా ఎంత తీయంది ప్రేమని
ఆకాశ దీపాలు ఇల చేరగా తెర తీసింది ఆమని
ఇది సంగీతమో తొలి సంకేతమో
ఇది ప్రియగీతమో మధు జలపాతమో ఒ ఒ

యేనాడు ఏ దేవతో మనను కలిపిన వేళా వేళా
ఈనాడు ఈ దేవితో మనసు తెలిపెను చాల చాలా
కాలాలు ఒకసారి ఆగాలిలే మన తొలిప్రేమ సాక్షిగా
లోకాలు మన వెంట సాగాలిలే మన ప్రేమికుల తోడుగా
ఇది ఆరధనో మది ఆలాపనో
మన సరసాలకే తొలి సంకీర్తనో ఒ ఒ ఒ

No comments: