01 July 2010

నవ్వాలి నీతో..నడవాలి నీతో..

నవ్వాలి నీతో..నడవాలి నీతో..నెలవంక మీద నిలవాలి నీతో..
ఆడాలి నీతో..అలగాలి నీతో..హరివిల్లు మీద ఊగాలి నీతో..
తడవాలి నీతో..ఆరాలి నీతో..గడపాలి అనుక్షణం నేనే నీతో..

నవ్వాలి నీతో..నడవాలి నీతో..నెలవంక మీద నిలవాలి నీతో..

వస్తానని మాటిచ్చాకా..కావాలని నే రాలేకా..నీలో చాలా ఆరాటాన్నే పెంచాలీ..
వేరే కన్నెను నేనింక వంకర చూపులు చూసాకా..నీలో కలిగే ఆక్రోశాన్నే కాంచాలీ..

నీ పైట గాలిని పీల్చాలీ..
నీ మాట తేనెను తాగాలీ..
నును లేత చివాట్లు తింటా నీతో..

నవ్వాలి నీతో..నడవాలి నీతో..నెలవంక మీద నిలవాలి నీతో..
ఆడాలి నీతో..అలగాలి నీతో..హరివిల్లు మీద ఊగాలి నీతో..

చీటికి మాటికి ఊరించీ..చిలిపితనం తో ఉడికించీ..ముద్దుగ మూతిని ముడుచుకునుంటే చూడాలీ..
ఓ..అంతకు అంతా లాలించీ..ఆపై నీపై తలవాల్చీ..బ్రతిమాలేస్తూ నీతో జతగా బ్రతకాలీ..

నీ వేలి కొనలను నిమరాలీ..
నీ కాలి ధూళిని తుడవాలీ..
అరచేతి గీతల్లే ఉంటా..నీతో..

నవ్వాలి నీతో..నడవాలి నీతో..నెలవంక మీద నిలవాలి నీతో
ఆడాలి నీతో..అలగాలి నీతో..హరివిల్లు మీద ఊగాలి నీతో..
తడవాలి నీతో..ఆరాలి నీతో..గడపాలి అనుక్షణం నేనే నీతో..

No comments: