05 July 2010

ఎందుకనో నినుచూడగనే కవ్వించాలని ఉంటుంది

ఎందుకనో నినుచూడగనే కవ్వించాలని ఉంటుంది
ఎందుకనో నినుచూడగనే కవ్వించాలని ఉంటుంది
కవ్వించి నీవు కలహమాడితే నవ్వుకొనాలని ఉంటుంది ||ఎందుకనో||
ఎందుకనో నిను చూడగనే ఏదో ఇదిగా ఉంటుంది
ఎందుకనో నిను చూడగనే ఏదో ఇదిగా ఉంటుంది
నీ పెదవులపై నవ్వు చిందితే మనసు చల్లగా ఉంటుంది ||ఎందుకనో||

అడుగడుగున నీ రాజసమంతా ఒలికిస్తూ నువు కులుకుతు వుంటే
అడుగడుగున నీ రాజసమంతా ఒలికిస్తూ నువు కులుకుతు వుంటే
నా కొంగున కట్టుకు నిను తిప్పాలని
నా కొంగున కట్టుకు నిను తిప్పాలని
ఏదో వేడుక పుడుతుంది,ఎందుకనో ||ఎందుకనో||

అణువణువున నీ వంపుల సొంపులు నను మైకంలో ముంచుతు వుంటే
అణువణువున నీ వంపుల సొంపులు నను మైకంలో ముంచుతు వుంటే
నీలో ఐక్యం చెందాలంటూ నీలో ఐక్యం చెందాలంటూ
ఏదో తహతహ పుడితుంది ||ఎందుకనో||

No comments: