09 November 2010

కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత

కనపడ లేదా గోదారి తల్లి కడుపుకోత వినబడలేద
గోదారి నీళ్ళ రక్తఘోష ||కనబడ||
గుండె నిండ పాలున్న బిడ్డల కందించలేని
తల్లి బ్రతుకుదేనికని
బీళ్ళు నింపె నీళ్ళున్న సముద్రాన పడిపోయె శాపంతనకెందుకని
బరువై దయకరువై తనవెలుగె ఇక బలియై ||2||
ఉప్పుసాగరాలలోకి వెళ్ళలేక వెళ్ళలే క వెక్కివెక్కిపడుతున్నది
ఉమాగ కనుమూయలేక ||2||
ఆ అలల అలజడి ఆతడి ఆరని కంటితడి ||2||
కనబడలేదా వినబడటంలేదా ||కనపడలేదా||

శిలా పలక లేసి మీరు ఎలా మరచిపోయారని
బాసరలో సరస్వతి పీఠమెక్కి అడిగినది
ధుర్మదాంధ్రులారా తెలుగు బిడ్డలకీ కర్మేందని
ధర్మపురిలో నరసింహ నాధం చేస్తున్నది
ఎడారులుగ మారుతున్న పొలాలను చూడలేక
కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది
పలుగు మోయలేని రైతు ఆత్మహత్యలను చరించి
భద్రాచల రాముడికి సాగిలపడి మొక్కినది
పాపి కొండల గుండె ధారై ప్రవహించినది
ధవళేశ్వకాటన్ మహాశైలి తలచినది
సిగ్గుపడండని కుటిల నాయకులని తిట్టినది
గుండె పగిలి నర్సాపూర్ సముద్రాన దూకినది ||కనపడలేదా||

No comments: