13 November 2010

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరానన్నెన్నడు మరువకురా కృష్ణా
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరానన్నెన్నడు మరువకురా కృష్ణామనసే కోవెలగా మమతలు మల్లెలుగా

ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం
ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం
కలకాలం మధి నిండాలి కలలన్నీ పండాలి
కలకాలం మధి నిండాలి కలలన్నీ పండాలి
మన కలలన్నీ పండాలి

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా

ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగ పొందాను
ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నే తోడుగ పొందాను
ప్రతి రేయీ పున్నమిగా బ్రతుకు తీయగా గడిపేము
ప్రతి రేయీ పున్నమిగా బ్రతుకు తీయగా గడిపేము

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా

నీ చూపులలో చూపులతో నీ ఆశలలో ఆశలతో
నీ చూపులలో చూపులతో నీ ఆశలలో ఆశలతో
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై ఒకరికి ఒకరై బ్రతకాలి

మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరానన్నెన్నడు మరువకురా కృష్ణా
మనసే కోవెలగా మమతలు మల్లెలుగా

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips