13 November 2010

హృదయమా ఓ బేల హృదయమా

హృదయమా ఓ బేల హృదయమా
ఒకేసారిగా నీకింత సంతోషమా
హృదయమా

తీయని ఊహలు హాయిగా నీలో మరల చిగీర్చే సుమా
పూచిన పూవులు నోచిన నోములు కాచి ఫలించు సుమా
అవి కాచి ఫలించు సుమా ||హృదయమా||
మనసు తెలుపగా నీకింత మోమోటమా
హృదయమా

తీగెలు సడలిన సితార తాను
తిరిగి మ్రోగె సుమా ||2||
మ్రోగిన పాటే మోహనమై
అనురాగము నించె సుమా ||2|| ||హృదయమా||

అందరాని ఆ చందమామ
నీ చేతికి అందె సుమా
చేతికి అందె సుమా
చందమామ నీ చేతులలోనే
బందీయగును సుమా
ఇక బందీయగును సుమా ||హృదయమా||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips