02 July 2010

తారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే

తారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే
కాదనగలనా కాదనగలనా
మెరుపే ఎదురోచ్చి చురుక్కున చుట్టేస్తే
కాదనగలనా కాదనగలనా
నిన్నటివరకు కన్నులు కనని కలయే చెలిగా కలిసోస్తే
కాదనగలనా కాదనగలనా

తారక

చందమామ వెన్నెలవ్వదా కలువలమాటను కాదనక
హోయ్ చల్ల కాస్త వెన్నకాదా క్రిస్ణుని మాటను కాదనక
ఏటినీరు కాదనలేక మేఘమల్లే మారేనుగా
మేఘమాల కాదనలేక వాగులాగా పారేనుగా
ఈ ప్రేమన్నది నీలీలేనని
నా జన్మననది నీ ఒళ్ళోకని ఆదివి ఈ భువి ఔనంటే
కాదనగలనా కాదనగలనా

తారక

చల్లగాలి పాట కాదా వేణువు మాటను కాదనక
పిల్ల మొగ్గ పువు కాదా తుమ్మెద మాటను కాదనక
పరిచయాలు కాదనలేక ప్రణయమల్లే మారేనుగా
ప్రణయకధలు కాదనలేక పరవశించి పోయేనుగా
నీ సిగ్గున్నది నే నల్లేందుకు
నీ బుగ్గున్నది నే గిల్లేందుకు
అనుకుని హత్తుకుపోమ్మంటే
కాదనగలనా కాదనగలనా

తారక

No comments: