02 July 2010

తలకు కొబ్బరి నూనెతో.....

||పల్లవి||
తలకు కొబ్బరి నూనెతో..... ఫుల్ హాండ్స్ షర్టుతో......
చేతిలో విక్రము గైడుతో....... జేబులో సిటి బస్సు పాసుతో.....
కదలి వస్తున్న ఓ తెలుగు విద్యార్ధి....... ఓయ్.........
చదవడానికెందుకురా తొందర.........
లవ్వు చెయ్యడమే నేర్చుకోర ముందర
చదవడానికెందుకురా తొందర.........
లవ్వు చెయ్యడమే నేర్చుకోర ముందర

||చరణం 1||
ఫస్ట్ పీరియడ్ లవ్ తెలుగు......... ఇందులో.......
అమ్మాయిని మాటల్లో ఎట్టా దించాలో......
అమ్మాయి అందాన్ని ఎట్టా పొగడాలో.....
ఎట్టా దించాలో..... ఎట్టా పొగడాలో......
ఆ పిల్లకి ప్రేమలేఖ ఎట్టా రాయాలో.......
ఫస్ట్ పీరియడ్ లోన నువ్వు తెలుసుకో........
ఫస్ట్ సైట్ లోనే లవ్వు చేసుకో

సెకండ్ పీరియడ్ లవ్ మాథమాటిక్స్.......
అమ్మాయితొ అనుబంధం కూడేదెట్టాగో......
అమ్మాయిలో మొగమాటం తీసేదెట్టాగో........
కూడేదెట్టాగో...... తీసేదెట్టాగో........
ఆ పిల్ల ఫ్రెండ్సుని భాగించేదెట్టాగో........
సెకండ్ పీరియడ్ లోన నువ్వు నేర్చుకో.......
సెకండ్ థాటేలేక దూసుకెళ్ళిపో........

థర్డ్ పీరియడ్ లవ్ హిస్టరీ.......
అమ్మాయి నాన్నగారు ఏం చేస్తుంటాడో.....
అమ్మడికి ఆస్తిపాస్తు లెంతెంతున్నాయో....
ఏం చేస్తుంటాడో..... ఎంతెంతున్నాయో....
ఆ పిల్లకి పెళ్ళికాని అక్కయ్యలు ఎందరో.....
థర్డ్ పీరియడ్ లోన నువ్వు తెలుసుకో......
హార్డ్ వర్కే చేసి లవ్వు గెలుచుకో....

బాబు.....చదవడానికెందుకురా తొందర.........
లవ్వు చెయ్యడమే నేర్చుకోర ముందర
ఫోర్త్ పీరియడ్ లవ్ ఫిజిక్స్.......
మాగ్నెట్లా మనవైపుకు ఎట్టా లాగాలో.....
ఆ పిల్లలో కరెంటుని ఎట్టా పెంచాలో.......
ఎట్టా లాగాలో..... ఎట్టా పెంచాలో.......
యాక్షన్ కు రియాక్షను ఎట్టా ఇవ్వాలో.......
ఫోర్త్ పీరియడ్ లోనా నువ్వు తెలుసుకో.....
గుర్తు ఉండేలాగా వర్తు చూపుకో.......

ఫిఫ్త్ పీరియడ్ లవ్ కెమిస్ట్రి......
విడిపోని లవ్ బాండు ఎట్టా వెయ్యాలో.....
ఒకటయ్యే ఈక్వేషన్ ఎప్పుడు రాయాలో......
ఎట్టా వెయ్యాలో..... ఎప్పుడు రాయాలో......
ఆ పైన ప్రాక్టికల్సు ఏమేం చెయ్యాలో.....
ఫిఫ్త్ పీరియడ్ లోన నువ్వు తెలుసుకో.....
డెప్త్ పెంచేసుకో డేరు చేసుకో.......

లాస్ట్ పీరియడ్ లవ్ స్పోర్ట్స్.......
అమ్మాయి ఇంటిగోడ ఎట్టా దూకాలో.......
ఎవడైనా అడ్డొస్తే ఎట్టా తన్నాలో....
ఎట్టా దూకాలో....... ఎట్టా తన్నాలో....
ఆ పిల్లను తీసుకును ఎట్టా ఉరకాలో......
లాస్ట్ పీరియడ్ లోన నువ్వు తెలుసుకో......
లాస్ట్ దాకా తనతో లైఫు పంచుకో........

తలకు కొబ్బరి నూనెతో..... ఫుల్ హాండ్స్ షర్టుతో......
చేతిలో విక్రము గైడుతో....... జేబులో సిటి బస్సు పాసుతో.....
కదలి వస్తున్న ఓ తెలుగు విద్యార్ధి.......
చదవడానికెందుకురా తొందర.........
లవ్వు చెయ్యడమే నేర్చుకోర ముందర

1 comment:

Sunitha said...

Hi Your songs collection is very nice.
Keep it up.