02 July 2010

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని

చీకటి తో వెలుగే చెప్పెను నేనున్నానని, ఓటమి తో గెలుపే చెప్పెను నేనున్నానని......
నేనున్నాననీ......నీకేం కాదని, నిన్నది రాతని మార్చేస్తానని........ ||చీకటి తో||
తగిలే రాళ్ళను పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళను హితులుగ తలచి ముందుకేల్లాలని.....
కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగ మలచి కాంతి పంచాలని
గుండెతో ధైర్యం చెప్పెను, ప్రశ్నతో బదులే చెప్పెను, అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని
నేనున్నాననీ......నీకేం కాదని, నిన్నది రాతని మార్చేస్తానని........

No comments: