09 November 2010

ఇంత దూరమొచ్చినాక సిగ్గెందుకూ

ఇంత దూరమొచ్చినాక సిగ్గెందుకూ ఈడు రగులుకున్నాక అగ్గెందుకూ
అంతదాక వచ్చాక అడ్డెందుకూ లోతులోన మునిగాక ఒడ్డెందుకూ
కరుసు పెట్టనప్పుడు సొమ్మెందుకూ సరస మాడనప్పుడు సొగసెందుకూ
గుడు గుడు గుడు గుడు గుడు గుడు గుంజం
అడు గుడు అడు గుడు గుడు గుడు లంచం ||గుడు||
చెడుగుడు చెడుగుడు గుడు ఛంఛం

కంటిలోన నలుసు తీయమన్నావు
నలుసు తీసి చంప నలపమన్నావు చెంపగిల్లి ఆగలేవు అన్నావు
పెదవి పండు ముద్దు పిండుకున్నావు
పెదవి నుండి మెడలోకి చేరుకున్నాకా
మెడలోని గొలుసుతోటి ఆడుకున్నాకా
గుండెలో జారుకుని గుట్టునే గుంజుకుని
అంతలో పుంజుకుని అదునుచూసి అదుపుదాటితే ||గుడు||
జరుగుడు జరుగుడు గుడు కొంచెం ||గుడు||
విరుగుడు విరుగుడు గుడు మంచం

కాలిలోని ముల్లు తియ్యమన్నావు
ముల్లుతీసి మువ్వ ముట్టమన్నావు
మువ్వముట్టి ముందుకెళ్లి పోయావు చీర అంచుపట్టి పైకి పాకావు
చీరలోని మూరలోని చిక్కుకున్నాక
దారి తెన్ను ఏదినాకు చిక్కకున్నాక
చెంగులే దులుపుకుని నిన్ను చేపట్టుకుని
చీరలా చుట్టుకుని చివరి వరకు కధలు నడిపితే ||గుడు||
పెరుగుడు పెరుగుడు గుడు పైత్యం ||గుడు||
తరికిట తరికిట కిట కిట తధ్యం ||ఇంత||

No comments: