09 November 2010

బంతి కావాలా? బాలు కావాలా?

బంతి కావాలా? బాలు కావాలా?
మెంతికూరలాంటి పిల్ల చెంతకొచ్చి చేరుకుంటె
బంతెందుకు? బాలెందుకు? ఏదేదో అడగరాదూ ఇవ్వనన్నానా
ర్యాలీ రావులపాడు రేలంగీ సంతలోన
నిప్పుకోడి తెచ్చినాను నిప్పుకోడి తెచ్చినాను
పెట్టియ్యవే పిల్లా పెట్టియ్యవే పెట్టియ్యవే ఇగురు పెట్టియ్యవే
ఓరోరి బుల్లోడా వయ్యారి బుల్లోడా వగలమారి బుల్లోడా
వాల్తేరు బుల్లోడా అంతగాను అడుగుతుంటే పెట్టీయనా
అటక మీద పాత ట్రంకు పెట్టియ్యనాట్రంకు పెట్టీయ్యనా
కర్నూలు టౌనులోని కంసాలి కొట్టులోన
పట్టగొలుసు తెచ్చినాను పట్టగొలుసు తెచ్చినాను
కాలియ్యనే పిల్లా కాలియ్యవే కాలియ్యవేనీ కుడి కాలియ్యవే
ఓరోరి బుల్లోడా ఒయ్యారి బుల్లోడ వగలమారి బుల్లోడా
వాల్తేరు బుల్లోడా వెంటపడుతు వేడుకుంటే కాలివ్వనా
ఇంటికెళ్లినాక ఫోను కాలివ్వనా ఫోను కాలివ్వనా

మంత్రిగారి కోటలోన మన ఇద్దరి పేరుమీన
రైలుటికెటు తెచ్చినాను రైలు టికెటు తెచ్చినాను
చుట్టేయ్యవే పిల్లా చుట్టేయ్యవే చుట్టెయ్యవే బిస్తరు చుట్టేయ్యవే ||ఓరోరి||
పట్టుపట్టి అడుగుతుంటె చుట్టివ్వనా
అంటు పెట్టుకుంటె గంట చుట్టివ్వనా గంట చుట్టివనా
అడిగింది అందుకోక అందేది అడగలేక
నీరుగారి పోయినావు నీరుగారి పోయినావు
చారెయ్యనా పిలగా చారెయ్యనా చారెయ్యనా ఉలవ చారెయ్యనా ||ఓసోసి||
చిలిపి చిందులాటలోన చారెయ్యవే ఏక్, దో, తీన్,
చారెయ్యవే చారు, పాంచెయ్యవే

షామీరు పేటలోన షావుకారు షాపులోన
నోటుబుక్కు తెచ్చినాను నోటుబుక్కు తెచ్చినాను
రాసియ్యవే పిల్లా రాసియ్యవే రాసియ్యవే అందం రాసియ్యవే ||ఓరోరి||
పాత్తుకోరి చేరుకుంటె రాసెయ్యనా
నెత్తిమీద మంచినూనె రాసెయ్యనా
మాటల పోటీలోన మీది మీది ఆటలోన
పిల్లతోటి ఓడినావు పిల్లతోటి ఓడినావు
తీసెయ్యరో పిలగా తీసెయ్యరో తీసెయ్యరో మీసం తీసెయ్యరో ||ఓసోసి||

No comments: