04 July 2010

కలలెందుకు కథలెందుకు తలపెందుకు తపమెందుకు

ఆ ఆ ఆ ఆ ఆ
కలలెందుకు కథలెందుకు తలపెందుకు తపమెందుకు
కలలెందుకు కథలెందుకు తలపెందుకు తపమెందుకు
కోర్కెలన్ని కనులముందే కొలువు తీరిన వేళ
కోర్కెలన్ని కనులముందే కొలువు తీరిన వేళ
కలలెందుకు కథలెందుకు తలపెందుకు తపమెందుకు

కొనచూపుల కలికితనం విరుల వాన కురిసింది
కొనచూపుల కలికితనం విరుల వాన కురిసింది
కరిగిపోని కాంతివనం కోటి చిగురులేసింది
చిరునవ్వుల చల్లదనం సిరుల వరము చిలికింది
చిరునవ్వుల చల్లదనం సిరుల వరము చిలికింది
చెదిరిపోని చెలిమి దనం తీరని రుణమయ్యింది
మలిగిపోని మమతలన్ని మదిని వెలిగే వేళ
పోత పోసిన పున్నెమంత పున్నమయ్యే వేళ

ఆ ఆ ఆ ఆ ఆ
కలలెందుకు ఆ ఆ ఆ ఆ
కథలెందుకు ఆ ఆ ఆ ఆ
తలపెందుకు ఆ ఆ ఆ ఆ
తపమెందుకు ఆ ఆ ఆ ఆ

No comments: