09 November 2010

సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము

సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము
మలయజ మారుత శీతలము మనసిజ రాగ వశీకరము
సుందరము సుమధురము చందురుడందిన చందన శీతలము

ఆనందాలే భోగాలైతే
హంసానందే రాగాలైతే
నవవసంత గానాలేవో సాగేనులే
సురవీణా నాదాలెన్నో మోగేనులే
వేకువలో వెన్నెలలో
చుక్కలు చూడని కోనలలో
మానుల కొమ్మల మూగిన కోయిల
వేణువులూదిన గీతికలో || సుందరము ||


అందాలన్నీ అందేవేళా
బంధాలన్నీ పొందేవేళా
కన్నుల్లో గంగా యమునా పొంగేనులే
కౌగిట్లో సంగగమేదో సాగేనులే
కోరికలే .... ఆడిన పాడిన...
మల్లెల తావుల పిల్లనగ్రోవులు
పల్లవి పాడిన పందిరిలో || సుందరము ||

No comments: