09 November 2010

మనసే పాడెనులే మైమరచి

మనసే పాడెనులే మైమరచి
మనసే పాడెనులే || 2 ||
సెలయేటి మలుపులా విరితోట పిలుపులా
ఏటి మలుపులా విరితోట పిలుపులా
సరసరాగ సంకీర్తనగా నేడే || మనసే ||

కోయిలలై పలికే తీయని నీ పిలుపే
కురిసెను కోనల్లో రాగాలేవో || 2||
అందియలై మ్రోగే సందెలోనే
అంచులు తాకే అందాలేవో
జిలుగులొలుకు చెలి చెలువం
కొలను విడనై నవకమలం || 2||
అది మీటే నాలో ఒదిగిన కవితల || మనసే ||

No comments:

                                                           Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips