10 November 2010

అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ

అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ
అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ
అటవి ముల్లంటి పడుచోయమ్మ, మరదలు కూన అదిమరలకు కోన
మెరుపుల మేన చలి ఇరుకులు చానా
అరె కన్ను, కాక కాటుకరెక్క చెక్కిలి చుక్క,
జున్ను ముక్క జుర్రుకుపోనా, చక్కని చుక్కా
అల్లెల్లే అల్లెల్లే మా అల్లెల్లే మామ
మొగలిపూవంటి మొగుడోయమ్మ
మరువపు తేమ, తెగమరిగిన మామ, కొరకని జామ ఈ చిలకదిరామ
చుక్కాలొచ్చేదాక నిన్ను ఆపేదెట్టా,
ఒహొ దీపాలెట్టేలోగా తాపాలొస్తే ఎట్టా

హే జమాయించూ
ఓ తమాయించు
పువ్వులబోనాలు, చిరునవ్వుల దాణాలు,
పుంజుకు పెట్టేస్తే లేత ముంజుల ముద్దిస్తా
వెన్నెల బాణాలు, నులివెచ్చని ప్రాణాలు
జివ్వున లాగేస్తే మామ జాతరకొచ్చేస్తా
హే ఒంపుసొంపు వాగువంకై వచ్చేస్తావా
యహ్ కట్టూ బొట్టూ తేనెల పండూ గుచ్చేస్తావా ||అల్లేల్లే||

హే యమాగుంది
ఈ జమాబందీ
చింతల తోపుల్లో నీ చింతల దోచేస్తా
సంతల బేరాల్లో భీమా సిగ్గులు తూచేస్తా
చిందుల కాలంలో నా అందెలు అందిస్తా
సందడి సందెల్లో మామ చాటుగ సందిస్తా
హే రేపోమాపో లగ్గా లెట్టి లంగర్‌లేసేస్తా
అహా ఆటూపోటూ అడ్డేటేని ఒడ్డే చూస్తా ||అల్లేల్లే||

No comments:

                              Other Blogs తెలుగు పద్యాలు|బురిడి|అంబాజిపేట |Technology Tips