30 September 2007

ఉన్నమాట చెప్పనీవు

ఉన్నమాట చెప్పనీవు ఊరుకుంటె ఒప్పుకోవు ఇంకెలాగె సత్యభామ
నన్ను దాటి వెళ్ళలేవు నిన్ను నువ్వు దాచలేవు ఏమి చెయ్యనయ్యోరామ
అనుకున్నా తప్పు కదా మోమాటం ముప్పు కద
మనసైతే ఉంది కదా మన మాటేం వినదు కద
పంతం మానుకో భయం దేనికో

వద్దన్నకొద్ది తుంటరిగా తిరగకలా నా వెనక
నిద్దర్లో కూడ వంటరిగా వదలవుగా
నన్నాశపెట్టి ఈ సరదా నేర్పినదే నువ్వు గనక
నా కొంగు పట్టి నడవనిదే కుదరదుగా
అడుగడుగున ఎదురైతే ఏ దారి తోచదుగా
అటు ఇటు ఎటు తేల్చవుగా మన కథ నువు తొందరగా
ప్రతీ చోట నీ నవ్వే పిలుస్తోందిగా

ఆమాయకంగ చూడకలా వేడుకలా చిలిపి కల
అయోమయంగ వెయ్యకలా హాయి వల
నీ మీదకొచ్చి ఉరితాడై వాలదుగా వాలు జడ
దానొంక చూస్తే ఎందుకట గుండె ధడ
మరి మరి శృతి మించి ఇలా నను మైమరపించకలా
తడబడి తల వంచి ఇలా తలపును అణిచేస్తే ఎలా
మరేం చెయ్యనే నీతో ఎలా వేగనే

No comments: