Showing posts with label Movie - Uyyala Jampala. Show all posts
Showing posts with label Movie - Uyyala Jampala. Show all posts

20 October 2007

కొండగాలి తిరిగింది ..

కొండగాలి తిరిగింది .. కొండగాలి తిరిగింది
గుండె ఊసులాడింది గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
పుట్టమీద పాలపిట్ట పొంగిపోయి కులికింది
గట్టుమీద కన్నెలేడి గంతులేసి ఆడింది
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది
పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది
పట్టరాని లేత వలపు పరవశించి పాడింది
కొండగాలి తిరిగింది .. గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది


మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది
మొగలిపూల వాసనతో జగతి మురిసిపోయింది
నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది
పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చింది
పడుచుదనం ఆందానికి తాంబూలమిచ్చింది
ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది
కొండగాలి తిరిగింది .. గుండె ఊసులాడింది
గోదావరి వరదలాగ కోరిక చెలరేగింది

ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు

ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా
ఊరు విడచి వాడ విడచి ఎంత దూరమేగినా
సొంతవారు ఐనవారు అంతరాల ఉందురోయ్ .. అంతరాల ఉందురోయ్
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధము
పెంచుకున్న కొలది పెరుగు తీయని అనుబంధము
గాయపడిన హృదయాలను జ్ఞాపకాలే అతుకనోయ్… జ్ఞాపకాలే అతుకనోయ్
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
కనుల నీరు చిందితే మనసు తేలికౌనులే
కనుల నీరు చిందితే మనసు తేలికౌనులే
తనకు తనవారికి ఎడబాటే లేదులే .. ఎడబాటే లేదులే
ఏటిలోని కెరటాలు ఏరు విడిచి పోవు
ఎదలోపలి మమకారం ఎక్కడికీ పోదు
ఎక్కడికీ పోదు … ఎక్కడికీ పోదు