Showing posts with label Movie - Mr Medhavi. Show all posts
Showing posts with label Movie - Mr Medhavi. Show all posts

27 December 2010

కళ్ళు కళ్ళతో కలలే చెబితే

కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే

కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే
కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా

చూపు చూపుతో చిరు ఢీ కొడితే
నవ్వు నవ్వుతో స్నేహం కడితే
నిన్న లేనిదీ నేడు చేరితే ప్రేమా

అందంగా అందంగా పెనవేస్తూ బంధంగా
చేస్తుందీ చిత్రంగా బ్రతుకంతా మధురంగా

మది వేగం పెరిగితె ప్రేమా
హృదిరాగం పలికితె ప్రేమా
ఎదలేకం ఐతే మౌనం తొలిప్రేమా

దిల్ మే ప్యార్ హై మన్ మే ఇష్క్ హై

కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే
కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా

ఉండదుగా నిదరుండదుగా మరి ఊహల వలనా
ఇక అల్లరులే శృతిమించెనుగా ప్రతి రేయిలో కలనా
ఇది అర్ధం కానీ మాయా ఏదో తీయని బాధా

చెప్పకనే చేరీ అది చంపేస్తుందీ మైకానా
స్వప్నాలే చల్లీ ఇది ముంచేస్తుంది స్వర్గానా

ఊహకు కల్పన ప్రేమా
మది ఊసుల వంతెన ప్రేమా
ఈ గుప్పెడు గుండెలో ఉప్పెన ఈ ప్రేమా

దిల్ మే ప్యార్ హై మన్ మే ఇష్క్ హై

కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే
కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా

తొందరగా వివరించాలీ ఈ తీయని దిగులూ
మరి ఒప్పుకుని అందించాలి తన నవ్వుతో బదులూ
సరికొత్తగ ఉందీ అంతా అరె ఎన్నడులేనీ వింతా

తానుంటే చాలూ వాసంతం నాకై వస్తుంది
ఆనందం అంతా దాసోహం నాకే అవుతుంది

ఇది గుసగుసలాడే ప్రేమ
నను త్వరపెడుతుంది ప్రేమ
తొలిసారిగ అందితె హాయే ఈ ప్రేమా

కళ్ళు కళ్ళతో కలలే చెబితే
మనసు మనసుపై అలలా పడితే
కొత్త కొత్తగా చిగురించేదే ప్రేమా

చూపు చూపుతో చిరు ఢీ కొడితే
నవ్వు నవ్వుతో స్నేహం కడితే
నిన్న లేనిదీ నేడు చేరితే ప్రేమా