Showing posts with label Movie - Chaduvukunna Amayillu. Show all posts
Showing posts with label Movie - Chaduvukunna Amayillu. Show all posts

21 July 2010

వినిపించని రాగాలే కనిపించని అందాలే--Chaduvukunna Amayillu

పల్లవి:

ఒ ఒ ఓ అహ ఆ
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే తలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే

చరణం1:

తొలి చూపులు నాలోనే వెలిగించే దీపాలే
తొలి చూపులు నాలోనే వెలిగించే దీపాలే
చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే
వలచి మనసే మనసే
వినిపించని రాగాలే

చరణం2:

వలపే వసంతములా పులకించి పూచినది
వలపే వసంతములా పులకించి పూచినది
చెలరేగిన తెమ్మరలే గిలిగింతలు రేపినవి
విరిసే వయసే వయసే
వినిపించని రాగాలే

చరణం3:

వికసించెను నా వయసే మురిపించు ఈ సోగసే
విరితేనెల వెన్నెలలో కోరతేదో కనిపించే
ఎదలో ఎవరో మెరిసే
వినిపించని రాగాలే కనిపించని అందాలే
అలలై మదినే తలచే కలలో ఎవరో పిలిచే
వినిపించని రాగాలే

ఎమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం --Chaduvukunna Amayillu

పల్లవి:

ఆ ఎమిటే
ఎమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం
ఎమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం
పాతరోజులు గుర్తొస్తున్నవి,ఉన్నది ఎదో వ్యవహారం
చాలును మీ పరిహాసం,ఈ సొగసంతా మీకోసం

చరణం1:

పొడరు తెచ్చెను నీకందం,బాగా వేసె నెడుమందం
పొడరు తెచ్చెను నీకందం,బాగా వేసె నెడుమందం
తక్కెడు పూలు తలను పెట్టుకొని తయారైతివా చిట్టిరత్తనం
చాలును మీ పరిహాసం,ఈ సొగసంతా మీకోసం

చరణం2:

ఆ ఆ ఆ ఓ ఓ ఓ
వయసులోన నేను ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వయసులోన నేను ముదురుదాననా
వయ్యారానికి తగనిదాననా
వరసకానుపులే వన్నె తగ్గినా
అందానికి నే తీసిపోదునా
ఎమిటి నా అపరాధం,ఎందుకు ఈ అవతారం

చరణం3:

దేవకన్య ఇటు ఒహో దేవకన్య ఇటు
దిగివచ్చిందని బ్రమసిపోదునా కలనైన
మహంకాళి నా పక్కనున్నదని మరచిపోదునా ఎపుడైనా
చాలును మీ పరిహాసం,ఈ సొగసంతా మీకోసం

చరణం4:

నీళ్ళు కలపని పాలవంటిది,పిండి కలపని వెన్నవంటిది
నీళ్ళు కలపని పాలవంటిది,పిండి కలపని వెన్నవంటిది
నిఖార్సైనది నా మనసు,ఊరూ వాడకు ఇది తెలుసు
ఎమిటి ఈ అవతారం,చాలును మీ పరిహాసం
ఎమిటి ఈ అవతారం,చాలును మీ పరిహాసం

గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను--Chaduvukunna Amayillu

పల్లవి:

గుట్టుగా లేతరెమ్మల కులుకు నిన్ను
రొట్టెముక్కల మధ్య పెట్టిరనుచు ఉ ఉ ఉ
ఏల ఇటుల చింతించువే టొమాటో
అతివలిద్దరి మధ్య నా గతినిగనుమా

ఒకటే హృదయము కోసము ఇరువురి పోటి దోషము
ఒకటే హృదయము కోసము ఇరువురి పోటి దోషము
ఒకటే హృదయము కోసము

ఒకరు సత్యభామ ఒకరేమో రుక్మిణి
మధ్య నలిగినాడు మాధవుడు
ఇద్దరతివలున్న ఇరకాటమేనయ
విశ్వదాభిరామ వినుర వేమా

చరణం1:

ఆ ఆ ఆ ఓ ఓ ఓ
జతగ చెలిమి చేసిరి
అతిగ కరుణే చూపిరి హ హ హ హ
చెలిమే వలపై మారితే
శివశివ మన పని ఆఖరే
ఒకటే హృదయము కోసము ఇరువురి పోటి దోషము
ఒకటే హృదయము కోసము

చరణం2:

ఆ ఆ ఆ ఓ ఓ ఓ
రామునిదొకటే బాణము
జానకి ఆతని ప్రాణము హ హ హ హ
ప్రేమకు అదియే నీమము
ప్రేయసి ఒకరే న్యాయము
ఒకటే హృదయము కోసము ఇరువురి పోటి దోషము
ఒకటే హృదయము కోసము

ఏమండొయ్ నిదుర లేవండొయ్--Chaduvukunna Amayillu

పల్లవి:

ఏమండొయ్ నిదుర లేవండొయ్
ఏమండొయ్ నిదుర లేవండొయ్
ఎందుకు కలలో కలవరింత
ఎవరిని తలచి పలవరింత
ఎదుటకురాగ ఏల ఈ మగత
ఏమండొయ్ నిదుర లేవండొయ్

చరణం1:

ప్రేయసి నిద్దుర లేపుట,మోము చూపుట
పెళ్ళికి తదుపరి ముచ్చట
ముందు జరుగుట చాలా అరుదట
కమ్మని యోగం కలిసిరాగా కన్నులు మూసి కపటమేల
బిగువు బింకం ఇంక చాలండోయ్
ఏమండొయ్ నిదుర లేవండొయ్

చరణం2:

యువతులు దగ్గర చేరినచో యువకులు ఉరకలు వేసెదరే
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
కోరిన కోమలి చేరగనే కులుకులు అలుసైపోయినవా
గురకలు తీసే కుంభకర్ణ నటన మానండోయ్
ఏమండొయ్ నిదుర లేవండొయ్

చరణం3:

నేనే వలచి రానిచో చెంత లేనిచో
నిదురే రాదని అంటిరి బ్రతుకనంటిరి మోసగించిరి
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
నిద్రాదేవిని వీడకుంటే ఉద్యోగాలు ఊడునండోయ్
ఇద్దరి ఆశలు ఇంక క్లోజండోయ్

ఏమండొయ్ నిదుర లేవండొయ్
ఏమండొయ్ నిదుర లేవండొయ్

నీకో తోడు కావాలి--Chaduvukunna Amayillu

పల్లవి:

నీకో తోడు కావాలి
నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ నన్నే నీదాన్ని చేసుకోవాలి
నీకో తోడు కావాలి
నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ నన్నే నీదాన్ని చేసుకోవాలి

చరణం1:

నవ నాగరిక జీవితాన తేలుదాం
నైటు క్లబ్బులంటు నాట్యమాడి సోలుదాం
నువ్వు అందమైన టిప్పుటాపు బాబువి
నేను అంతకన్న అప్టుడేటు బేబిని
వగలాడి నీకు తాళి బరువు ఎందుకు
ఎగతాళి చేసి దాని పరువు తీయకు

నీకో తోడు కావాలి
నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

చరణం2:

నేను పేరుబడిన వారి ఇంట పుట్టిపెరిగాను
ఏదో హారుమొని వాయిస్తూ పాడుకుంటాను
దనిస నిదనిప మగదిరస దిగమప
నేను చదువులేని దాననని అలుసు నీకేల
నీకు కలసివచ్చు లక్షలాస్తి విడిచిపోనేల
నీతో వియ్యం దినదిన గండం
నీ ఆస్తికోసం ఆత్మ నేను అమ్ముకోజాల

నీకో తోడు కావాలి
నాకో నీడ కావాలి
ఇదిగో పక్కనుంది చక్కనైన జవ్వని
ఓ తల్లీ దయచేయి కోటిదండాలు

చరణం3:

సిరులు నగలు మాకులేవొయి
తలుకుబెలుకుల మోజులేదోయి
అహహ ఆ ఆ ఆ ఆ ఆ
చదువు సంస్కృతి సాంప్రదాయాలు
తెలుగుతనమే మా రత్నహారాలు
ధనరాశికన్నా నీ గుణమే మిన్న
నీలో సంసార కాంతులున్నాయి

నీకో ప్లూటు దొరికింది
మెడలో జొలి కడుతుంది
ఈమె కాలిగోటి ధూళి పాటి చేయరు
ఓ త్వరగా దయచేస్తె కోటి దండాలు
నీకో తోడు కావాలి
నాకో నీడ కావాలి
ఒహొ పక్కనున్న చక్కనైన జవ్వని
నిన్నే నాదాన్ని చేసుకుంటాను

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది--Chaduvukunna Amayillu

పల్లవి:

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనె అంతులేని అర్ధమున్నది,అర్ధమున్నది
మొదటిరోజు కోపం అదొరకం శాపం
పోను పోను కలుగుతుంది భలే విరహతాపం
బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు,పొత్తు కుదరదు

చరణం1:

పడుచువాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల తగలగానే లోన లొటారం
పడుచువాడి ఒహొ పడుచువాడి మిడిసిపాటు పైన పటారం
ఒక గడుసు పిల్ల తగలగానే లోన లొటారం
వగలాడి తీపితిట్టు తొలివలపు తేనె పట్టు
ఆ తేనెకోరి చెంత చేర చెడామడా కుట్టు
అహ బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు,పొత్తు కుదరదు

చరణం2:

పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలు
కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు
పెళ్ళికాని వయసులోని పెంకిపిల్లలు
తమ కళ్ళతోనె మంతనాలు చేయుచుందురు
వేడుకున్న రోషం అది పైకి పగటి వేషం
వెంటపడిన వీపు విమానం

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనె అంతులేని అర్ధమున్నది,అర్ధమున్నది

చరణం3:

చిలిపి కన్నె హృదయమెంతొ చిత్రమైనది
అది చిక్కుపెట్టు క్రాసువర్డు పజిలు వంటిది
చిలిపి కన్నె ఉహు చిలిపి కన్నె హృదయమెంతొ చిత్రమైనది
అది చిక్కుపెట్టు క్రాసువర్డు పజిలు వంటిది
ఆ పజిలు పూర్తిచేయి,తగుఫలితముండునోయి
మరుపురాని మధురమైన ఫ్రైజు దొరుకునోయి

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది
అహ అందులోనె అంతులేని అర్ధమున్నది,అర్ధమున్నది
ఆ ఆ బ్రహ్మచారి లేతమనసు పైకి తేలదు
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు,పొత్తు కుదరదు

ఒహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది--Chaduvukunna Amayillu

పల్లవి:

ఒహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

చరణం1:

వెచ్చగ జవ్వని తాకితే పిచ్చిగ ఊహలు రేగునే
రెపరెపలాడే గుండెల్లోన ప్రేమ నిండేనే
అయ్యో పాపం , తీరని తాపం
భావ కవిత్వం చాలునోయి బెజ్జంలోన జారకోయి
పెళ్ళికి ముందు ప్రణయాలు ముళ్ళ బాణాలు

ఒహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది

చరణం2:

పెద్దల అనుమతి తీసుకో
ప్రేమను సొంతం చేసుకో
హద్దుపద్దు మీరిన ఆటకట్టేను
యస్ అంటారు మావాళ్ళు
నో అంటేను తకరారు
తల్లి తండ్రి కూడంటే గుళ్ళో పెళ్ళి చేసుకుందాం
ధైర్యం చేసి నీవేగా దారి చూపావు
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

చరణం3:

మనసే దోచిన సుందరి
మమతే మల్లి పందిరి
పందిరిలోన మేనులు మరచి పరవశించాలి
అపుడే కాదు, ఎపుడంటావు
తొందరలోనే మూడుముళ్ళు అందరిముందు వేయగానే
తోడునీడై కలకాలం సాగిపోదాము

ఒహొ చక్కని చిన్నది వయ్యారంగా వున్నది
ఊరించేటి కన్నులతో నన్నే చూడన్నది
చిన్నది చాలా మంచిది నిన్నే నమ్ముకున్నది
నీవే తప్ప వేరెవరు లేనే లేరన్నది

09 July 2010

కిలకిల నవ్వులు చిలికిన

అతడు: కిలకిల నవ్వులు చిలికిన, పలుకును నాలో బంగారువీణ
ఆమె: కరగిన కలలే నిలిచిన, విరిసెను నాలో మందారమాల
అతడు: రమ్మని మురళీరవమ్ములు పిలిచె (2)
అణువణువున బృందావని తోచె

ఆమె: తళతళలాడే తరగలపైన అందీఅందని అందాలు మెరిసె
అతడు: కిలకిల నవ్వులు చిలికిన, పలుకును నాలో బంగారువీణ

ఆమె: నీవున్న వేరే సింగారములేల (2)
నీ పాదధూళి సింధూరము కాదా
అతడు: మమతలు దూసి మాలలు చేసి గళమున నిలిపిన కళ్యాణి నీవే
ఆమె: కరగిన కలలే నిలిచిన, విరిసెను నాలో మందారమాల

అతడు: నీ కురులే నన్ను సోకిన వేళ (2)
హాయిగ రగిలేను తీయని జ్వాల
ఆమె: గలగల పారే వలపులలోనే సాగెను జీవనరాగాల నావ
జంటగ: కిలకిల నవ్వులు చిలికిన, పలుకును నాలో బంగారువీణ
కిలకిల నవ్వులు చిలికిన