Showing posts with label Movie - Jwaala dweepa Rahasyam. Show all posts
Showing posts with label Movie - Jwaala dweepa Rahasyam. Show all posts

30 May 2011

చుక్కలన్ని చూస్తున్నాయీ

చుక్కలన్ని చూస్తున్నాయీ
చుక్కలన్ని చూచేనూ ఫక్కున నవ్వేనూ
ఎక్కడైన దాగుందామా చక్కనైన చినవాడా

చందమామ వస్తున్నాడు చందమామ వచ్చేనూ
నిన్ను నన్ను చూసేనూ
ఎక్కడైన దాగుందామా అందమైన చినదానా

మల్లె తీగమాటున కళ్ళు కలుపుకుందామా
కళ్ళలోని కోరికతో మనసు నింపుకుందామా

మల్లె తీగమాటున మల్లెలన్ని చూచేనూ
కళ్ళలోని కోరికలు మల్లెలే కాజేయులే
కళ్ళలోని కోరికలు మల్లెలే కాజేయులే

కొలనులోని నీళ్ళలో కొంతసేపు వుందామా
కలలుగనే హృదయంలో వలపు నిలుపుకుందామా

కొలనులోన దాగుంటే అలలు మనను చూచేనూ
వలపులోని తీయదనం అలలే కాజేయులే
వలపులోని తీయదనం అలలే కాజేయులే

నా కన్నుల చాటుగా నిన్ను దాచుకుంటానే
నీకౌగిలి మాటుగా నేను నిదురపోతాలే
నేను నీకు తోడునే నేను నీకు నీడనే
నీవు నేను ఒకటైటే జీవితం స్వర్గమే
నీవు నేను ఒకటైటే జీవితం స్వర్గమే