Showing posts with label movie - Mattilo Manikyam. Show all posts
Showing posts with label movie - Mattilo Manikyam. Show all posts

02 July 2010

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట.

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట.
నీ బ్రతుకంత కావలి పూలబాట..
పచ్చగా నూరేళ్ళు వుండాలని
నా నెచ్చలి కలలన్ని పండాలని

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట.
నీ బ్రతుకంత కావలి పూలబాట..

హృదయమనేదీ ఆలయము.. స్నేహం దాని ప్రతిరూపమూ..
హృదయమనేదీ ఆలయము.. స్నేహం దాని ప్రతిరూపమూ..
కులమేదైన.. మతమేదైనా
కులమేదైన.. మతమేదైనా..దానికి లేదు ఆ బేధమూ..

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట.
నీ బ్రతుకంత కావలి పూలబాట..

ఆశలు ఉంటాయి అందరికి .. అది నెరవేరేది కొందరికే..
ఆశలు ఉంటాయి అందరికి .. అది నెరవేరేది కొందరికే..
ఆనందాలు తేలే వేళ
ఆనందాలు తేలే వేళ .. అభినందనలు ఈ చెలికి

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట.
నీ బ్రతుకంత కావలి పూలబాట..
పచ్చగా నూరేళ్ళు వుండాలని
నా నెచ్చలి కలలన్ని పండాలని

మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట.
నీ బ్రతుకంత కావలి పూలబాట..

13 February 2010

నా మాటే నీ మాటై చదవాలి

నా మాటే నీ మాటై చదవాలి
నేనంటే నువ్వంటూ రాయాలి
అఅ ఈ ఈ ఉఉ ఎఎ

మట్టిలో రాసిన రాతలు గాలికి కొట్టుకుపోతే ఎట్టాగ
మనసులో రాసి మననం చేస్తే జీవితం అంతా ఉంటాయి.. నిలుచుంటాయి..

ఆ మాటే నిజమైతే నేర్పమ్మా .. మనసంతా రాస్తా కోకమ్మ

నా మాటే నీ మాటై చదవాలి
నేనంటే నువ్వంటూ రాయాలి

పడవ..గడవ
చిలక..పలక

కొండలు కొనలు ఎం చదివాయి
కో అంటే అవి కో అంటాయి

హృదయలుండి కదిలయంటే.. చదువులు చదవకే వస్తాయి.. బదులిస్తాయి
ఆ చదువే నేనింకా చదవాలి.. ఆ బదులే నీ నుంచి రావాలి