Showing posts with label Movie - Asembly Roude. Show all posts
Showing posts with label Movie - Asembly Roude. Show all posts

03 June 2010

అందమైన వెన్నెలలోనా అచ్చ తెలుగూ పడుచువలే

అందమైన వెన్నెలలోనా అచ్చ తెలుగూ పడుచువలే
మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమలా
మనసు నిండా మరులు పండా పసిడి పల్లకి ఎక్కాలా
రాగాలె ఊగాల శివరంజనవ్వాల
గరిసదస గరిసదస
చల్లనైన వేకువలోన సంకురాతిరి వెలుగువలే
ముద్దబంతి ముగ్గులలోకి సాగిరారా మగసిరిలా
కనులనిండా కలలు పండ పూల పడవ నడపాలీ
అందాలే చిందాలి అపరంజినవ్వాలి
గరిసదస గరిసదస గరిసదస


నురుగు తరగల గోదారై వలపు మిలమిల మెరవాలా
ఒంపు సొంపుల సెలయేరై వయసు గల గల నవ్వాలా
కొమ్మ మీద కోకిలనై కొత్తరాగం పలకాల
గుడికి నేను దీపమునై కోటి వెలుగులు కురియాలా
కంటి పాపనై కాలి అందెనై కాలమంత కరగబోసి కాపు ఉండనా
సరిగ రిగప గపద పదస గరిసదస గరిసదస గరిసదస


ఇంధ్రధనసూ విరిసిందీ ఏడు అడుగులు నడవాలా
సంధ్య చుక్క నిలిచిందీ బుగ్గ చుక్క పెట్టాలా
ఈడు జోడు ఎలుగెత్తి ఏరువాక పాడాలా
తొడు నీడా ఇరువురమై గూటికందం తేవాలా
తీగ మల్లెనై తేనే జల్లునై కోరికంత కూడబెట్టి కొలువు చేయనా
సరిగ రిగప గపద పదస గరిసదస గరిసదస గరిసదస