Showing posts with label Movie - Samayam. Show all posts
Showing posts with label Movie - Samayam. Show all posts

03 June 2010

సమయం చెడు జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ తలచిందా

సమయం చెడు జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ తలచిందా
గగనం తన సమయం మరచి నేలను యెర్రగ చేసిందా
భువనం తన గగనం మరచి ప్రళయం నీకై తెచ్చిందా
మేఘం తన భువనం మరచి వర్షం నీకై కురిసింద
నిలువెల్ల ఈ క్షనాలె కరిగిపోనీ
ప్రతి కాంతి తో జననం తుళ్ళిపోనీ
యే దిక్కు చూసినా గాని గతమే నని
ఆ పంచ భూతాలే నను మింగనీ


చరణం

రా ఇలా నా రాగం నువ్వై
కొనసాగనీ నా ప్రాణం నువ్వై
చేరవా నా కలలో కలవై
స్పందించనీ ప్రతి తాళం నువ్వై
నా మౌనాన్ని కరిగించె ఆలాపన నిను చేరని


చరణం

తీయగా నా విషమే నువ్వై
ఆపేయవా నా శ్వాసె మ్రుతివై
తెంపేయవా ఈ బంధం ఉరివై
తెంచేయవా నా ప్రాణం ఉరివై
నా చితిలోని మంటల్లో నా ప్రేమ వెలుగవ్వనీ