Showing posts with label Movie - Aadhi. Show all posts
Showing posts with label Movie - Aadhi. Show all posts

02 July 2010

తొలిపిలుపే నీ తొలిపిలుపే

||పల్లవి||
తొలిపిలుపే నీ తొలిపిలుపే మనసుకు తెలిపెను పసివలపే.......
తొలిపిలుపే నీ తొలిపిలుపే వయసుకు తెరిచెను చలి తలుపే.......
తొలిపిలుపే...... నున్ను నన్ను కలగలిపే........
తొలిపిలుపే...... నీలో నాలో కలలను కదిపే ||తొలిపిలుపే||

||చరణం 1||
ఒక చూపుతోటి ఒక చూపుకలిపి వెనుచూపు లేని జత పయనమిది
ఒక చేయిలోన ఒక చేయివేసి ఒకటయ్యే చెలిమిది
ఒక మాటతోటి ఒక మాట కలిపి మొగమాటమైన మగువాట ఇది
ఒక గుండెతోటి ఒక గుండెచేరి ఒదిగుండే కథ ఇది
ప్రతిపదమూ ప్రియా అని వలచినది
ప్రతిఫలము ఆశించని మమతల వ్రతమిది ||తొలిపిలుపే||

||చరణం 2||
మనసైన వేళ కనుసైగ చాలు పలు దేశభాషలిక ఎందుకులే
అధరాల పాల చిరుధార చాలు ఆహారం దేనికే
ఎదురైన వేళ కౌగిళ్ళు చాలు ఏ ఇల్లివాకిలిక ఎందుకులే
మన చుంబనాల సవ్వళ్ళు సంగీతం దేనికి
ఇరువురికీ ఏదో రుచి తెలిసినదీ
మనుగడకే మరోముడై ముడి పడు ముడుపిది ||తొలిపిలుపే||

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది

||పల్లవి||
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు...
నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు...
నీ కోకను సీతాకోక.... నీ పలుకును చిలకల మూక
నీ చూపును చంద్రలేఖ....... నీ పొంగును ఏరువాక
బదులిమ్మంటూ బతిమాలాయి ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు...
అసలివ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు... ||నీ నవ్వుల||

||చరణం 1||
నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైనా ఇవ్వద్దు
నా వైపే మొగ్గిన నీకైతె...... అవి మొత్తం ఇవ్వచ్చు
నీ బాసల్లోని తీయదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు
నేనంటే మెచ్చిన నీకైతె..... అది రాశిగ ఇవ్వచ్చు
భక్తి శ్రద్ధా ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు....
భక్తి శ్రద్ధా ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు....
నీకై మొక్కే నాకే ఇవ్వచ్చు...... ||నీ నవ్వుల||

||చరణం 2||
నీ భారం మోసే అదృష్టాన్ని భూమికి సైతం ఇవ్వద్దు
నా కోసం పుట్టిన నీకైతే..... అది పూర్తిగ ఇవ్వచ్చు
నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు
నాకెంతో నచ్చిన నీకైతె...... అది వెంటనె ఇవ్వచ్చు
నిను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నిను హత్తుకుపోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చు......

నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు...
నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు...
నా వాకిట ముగ్గులు నీకే.... నా దోసిట మల్లెలు నీకే
నా పాపిట సిగ్గులు నీకే....... నా మాపటి మెరుపులు నీకే
ప్రాయం పరువం ప్రణయం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా...
బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా.......