Showing posts with label Movie - Simhachala Mahatyam. Show all posts
Showing posts with label Movie - Simhachala Mahatyam. Show all posts

12 May 2010

సింహాచల మహత్యం

సింహాచల మహత్యం
సింహాచలము........ మహా పుణ్యక్షేత్రము
సింహాచలము........ మహా పుణ్యక్షేత్రము
శ్రీ వరాహ నరసిం హుని దివ్యధామము ||సింహాచలము||

ప్రహ్లాదుడు వేడగా...... శ్రీహరి కరుణించగా
ప్రహ్లాదుడు వేడగా...... శ్రీహరి కరుణించగా
ద్వయరూపాలొకటిగా.......
ద్వయరూపాలొకటిగా....... యుగ యుగాల గురుతుగా
ఆశ్రితులను కావగా వెలసిన హరి నిలయము ||సింహాచలము||

ఏచోటను విన్నా హరినామ స్మరణమే......
హరిహరిన్నారాయణా ఆదినారాయణా కరుణించి మమ్మేలు కమలలోచనుడా
హరిహరిన్నారాయణా ఆదినారాయణా కరుణించి మమ్మేలు కమలలోచనుడా
హరిహరిన్నారాయణా ఆదినారాయణా కరుణించి మమ్మేలు కమలలోచనుడా
ఏచోటను కన్నా భక్తుల సందోహమే
ఏచోటను విన్నా హరినామ స్మరణమే
పాపాలను హరియించే దైవ సన్నిధానము ||సింహాచలము||

మ్రొక్కులను ముడుపూలను చెల్లించువారికి.........
నీవే దిక్కని నమ్మి కొలిచేటివారికి.........
ఇహ పరములను సమకూర్చే భగవానుని నిలయము ||సింహాచలము||