Showing posts with label Movie - Ganesh(2009). Show all posts
Showing posts with label Movie - Ganesh(2009). Show all posts

14 November 2010

రాజహంసవో రాత్రి హింసవో రాచిలకా రావే

రాజహంసవో రాత్రి హింసవో రాచిలకా రావే
ఓ రసరంభా రావే
కంటి మన్మధా జంట తుమ్మెద సరసానికి రారా
నీవరసే రుచిలేరా
వయ్యారి గోదారి నీఒళ్లోనే ఈదేస్తా
అందాల గంధాలల్లి మెళ్లోనే పూసేస్తా
సరిపద మరి నీదే ఆలస్యం
సరిగమపద నీకే ఆహ్వానం ||రాజ||

శ్రీ చిలకమ్మ కులుకు సింగారాలే చిలుకు
ఊహల్లో నీ ఉలుకు తొలిమోహంలోనే పలుకు
విరహాల వీణలే సరసంగా మీటనా
అధరాల తేనెతో మురిపాలు పంచనా
సిగ్గేమొగ్గలై విచ్చేనులే
నీ బుగ్గసిగ్గులే తేలేనులే
అన్నీ నీవని వచ్చానుగా
నాకన్నె మనసునే ఇచ్చానుగా ||రాజ||

వరకట్నంగా వయసు అది ముట్టిందంటే అలుసు
ఇచ్చేసా నామనసు ఇకరానే రాదని తెలుసు
వయసమ్మ వాంఛలు వలలెన్నో వేయగా
కౌగిళ్ళ కంచెలు కసిఈడు మేయగా
ముద్దుముచ్చటే ఈరాతిరి సరిహద్దే లేనిది నీ అల్లరి
ఎన్నాళ్లాగునమ్మ ఈ కోరిక
మన తాంబూలాలకే తయ్యారుగా ||రాజ||

హిందీలోనా చుమ్మ తమిళంలో ముద్దమ్మ

హిందీలోనా చుమ్మ తమిళంలో ముద్దమ్మ
మళయాళంలో ఉమ్మ ఏదోటి ఇవ్వమ్మ ||హిందీ||
చక్కెరకన్న స్వీటు చిల్లీకన్న ఘాటు
లేజర్‌కన్నా ఫాస్టు
ఎండలకన్నా హాటు వెన్నెలకన్నా సాటు
అన్నిటికన్నా గ్రేటు
ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||2|| ||హిందీ||

ప్రతి ఊరిలో ప్రతిబ్యాంకులో లభించేది క్యాష్‌
ప్రతి జంటలో ప్రతి బుగ్గలో జనించేది కిస్‌
సీనా పెళ్లితో బలే నీటుగా లభించేది ఫస్టు
చెర్రీ పెదవితో మరీ గాటుగా రచించేది ముద్దు
కంటికి కలలేరాని జీవితం నిస్సారం
గంటకో ముద్దేలేని ప్రేమలే అనవసరం
ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||2|| ||హిందీ||

పదం మారినా రిధం మారినా పాట ఒక్కటేగా
కధే మారినా కలర్‌ మారినా ముద్దు ఒక్కటేగా
ప్రేమపక్షులు ఇచి పుచ్చుకొను ఆశ ముద్దులేగా
ప్రేమయాత్రలో కస్సుబుస్సులకు మందు కిస్సులేగా
దేవతల యవ్వనసూత్రం కడలిలో అమృతము
ప్రేమికుల నవ్వుకు మూలం గాఢ మధుచుంభనము
ఆ టేస్టేవేరు ఆ టేస్టేవేరు ||2|| ||హిందీ||

10 November 2010

రామా రామా అయ్యోరామా

రామా రామా అయ్యోరామా ||2||
అమ్మాయితో మాట్లాడితే; అయ్యోరామా
మీరు అపార్ధాలు తీస్తారు; అయ్యోరామా
హే లేడీతో ఫ్రీగా వుంటే; అయ్యోరామా
మీరు త్రీడీలో చూస్తారు; అయ్యోరామా
ఆడామగా దోస్తీ; మహాపాపమనే లోకం ఇదంట
ఏదో కసివుండి తనే కుళ్లుకునే కాలమిదంట ||అయ్యో|| అమ్మాయి||

బైకులపైన అలా బయటకి వెళితే
కాకుల కూతలే; అయ్యోరామా
బోరే కొట్టి అలా బీచ్‌కి వెళితే
బాకుల చూపులే; అయ్యోరామా
పుట్టిన రోజు అని పార్టీకెళ్లొస్తే
పుట్టెడు కధలల్లి అయ్యోరామా
పోస్టర్‌ వేస్తరు అయ్యోరామా
చింతలు తీర్చమని సింహాచలమెళితే
శీలం పోయెనని అయ్యోరామా
చాటింపేస్తారు అయ్యోరామా ||అయ్యో|| ||అమ్మాయి||

కంబైండుగా చదువు సాగిస్తుంటే
కలరే మారులే; అయ్యోరామా
ఆకలిపుట్టి అలా కేకులుతింటే
అల్లరి మాటలే; అయ్యోరామా
చేతులు కలిపేసి షేక్‌హేండ్‌ ఇస్తేనే
లోతుకు వెళతారు అయ్యోరామా
బూతులు వెతికేరు అయ్యోరామా
వీక్లీ ఓసారి ప్రేమే మిస్సయితే
డైలీ పలుమార్లు అయ్యోరామా
ఫీలైపోతారు అయ్యోరామా ||అయ్యో|| అమ్మాయి||

28 June 2010

లల్లలై లైలా మజ్ఞు మనమే అంటూ ఫీలైపోదాం

పల్లవి:

ఆమె:
లల్లలై లైలా మజ్ఞు మనమే అంటూ ఫీలైపోదాం
లల్లలై "ఎల్ ఓ వీ ఈ" మీనింగ్ ఏంటో కనిపెడదాం

అతను:
లల్లలై నువ్వు నేను ఇద్దరమంటే కాదని అందాం
లల్లలై నువ్వే నేను నేనే నువ్వై కనపడదాం

ఆ:
మనం ఒకటైతే సరిపోదే మన నీడలనేం చేద్దాం

అ:
వాటినీ పక్కన నిలిపి ఒకటిగ కలిపీ ప్రేమని పేరెడదాం


చరణం:

అ:
నీ ఒంటి మీద చోటు చూసుకుంటా
చిన్న పుట్టమచ్చలాగ అంటుకుంటా
రోజుకొక్క మాటు నువ్వు నన్ను తానాల వేళలోన ముట్టుకుంటె చాలునంటా

ఆ:
పచ్చబొట్టులాగ నేను మారిపోతా
వెచ్చనైన ఛాతిపైన వాలిపోతా
లాలి పాడుకున్న లాయిలాయి లల్లాయి హాయిలోన చందానాలు జల్లుకుంటా

అ:
నీ నడుమొంపు మెలికై ఉంటా
నీ జడపాయ నలుపై పోతా
నీలో లాగు తళుకై ఉంటా
నీ చేతికున్న గాజునై గలగలమంటా

ఆ:
హ్మ్మ్ కొంటె దిగులంతా పలికిందా నీ వయసున గిలిగింతా

అ:
తీగలాగిందే నీవని తొణికిందేమొ పెంచిన ప్రేమంతా


చరణం:

అ:
నువ్వు పిల్లిమొగ్గలెయ్యమంటె రెడీ
ఎత్తుకొండలెక్కి దూకమంటె రెడీ
కన్నె కంటి సైగ చెప్పినట్టు తూచాలు తప్పకుండ చేసుకుంట ప్రేమ సందడి

ఆ:
నువ్వు గాలి ముద్దు పెట్టుకుంటె రెడీ
తేనె విందులోకి దించుకుంటె రెడీ
నిన్ను రాసుకుంటు పూసుకుంటు రాగాలు తీసుకుంటు పాడుకుంట ప్రేమ మెలొడీ

అ:
నువ్వేదంటె అవునని అంటా
నీ పెదవంచు నవ్వై ఉంటా
నీ అరచేత పువ్వై ఉంటా
నా తూరుపెక్కడున్నదంటె నిన్ను చూపిస్తా

ఆ:
పట్టు తెర తీస్త ఎదురొస్తా నువు కోరిన అలుసిస్తా

అ:
అందుకే రేయీ పవలు రెప్పలు కాస్తూ నీకోసం చూస్తా

14 June 2010

తనేమందో..అందో లేదో తెలీలేదే నిజంగా..

ఇవ్వాళ నాకు చాలా హ్యాపీ గా ఉంది.
లైఫ్ అంతా నాతో ఇలాగే ఉంటావా

తనేమందో..అందో లేదో తెలీలేదే నిజంగా..
మదేం విందో విందో లేదో కలేంకాదే ఇదంతా..
ఇంత లోనే అంత మైకం పనికి రాదే ప్రాణమా
పరవశం లో మునిగి పోతే పైకి రాగలమా...

తనేమందో..అందో లేదో తెలీలేదే నిజంగా..
మదేం విందో విందో లేదో కలేంకాదే ఇదంతా..

కుడివైపున ఇంకో హృదయం ఉన్నాసరిపోదో ఏమో..
ఈ వెలుగును దాచాలంటే..
పడమరలోనైనా ఉదయం ఈ రోజే చూశానేమో..
మనసంతా ప్రేమై పోతే..
ఎగిరొచ్చిన ఏదో లోకం నాచుట్టూ వెలిసిందేమో..
మైమరపున నేనిలిచుంటే...

ఇంత లోనే అంత మైకం పనికి రాదే ప్రాణమా
పరవశం లో మునిగి పోతే పైకి రాగలమా...
తనేమందో..అందో లేదో తెలీలేదే నిజంగా..
మదేం విందో విందో లేదో కలేంకాదే ఇదంతా..

ఇదే క్షణం శిలై నిలవనీ..
సదా మనం ఇలా మిగలనీ..
జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్ళూ..
నీ జంటై ఇవ్వాళ్ళే జీవించా నూరేళ్ళూ..

తనేమందో.. మదేంవిందో..
తనేమందో..అందో లేదో తెలీలేదే నిజంగా..
మదేం విందో విందో లేదో కలేంకాదే ఇదంతా..
ఇంత లోనే అంత మైకం పనికి రాదే ప్రాణమా
పరవశం లో మునిగి పోతే పైకి రాగలమా...

తనేమందో..అందో లేదో తెలీలేదే నిజంగా..
మదేం విందో విందో లేదో కలేంకాదే ఇదంతా..