Showing posts with label Movie - Aata. Show all posts
Showing posts with label Movie - Aata. Show all posts

30 December 2010

నిను చూస్తుంటే చెడిపోతానే తప్పనుకోవుకదా

నిను చూస్తుంటే చెడిపోతానే తప్పనుకోవుకదా
పొగిడావంటే పడిపోతానే తప్పని గొడవకదా
పద పద అంటోందే హయ్ పదే పదే నీ అందం
అహా మహా బాగుందే హాయ్ మతే చెడి ఆనందం
ఉరకలెత్తే యవ్వనం తరుముతుంటే కాదనం
సనమ్ ఓ సనమ్ ||2|| నిను ||

తీగ నడుము కదా తూగి తడబడదా
రేకు విరిసిన సోకు బరువుకు సాయపడమనదా
ఆడ మనసుకద బైట పడగలదా
అంతసులువుగ అంతు దొరకదు వింత పొడుపు కథ
కబురు పంపిన పయ్యెదా ఇపుడు వెయ్యకు వాయిదా
సనమ్ ఓ సనమ్ ||2|| నిను ||

లేడి కన్నులతో వగలాడి వన్నెలతో
కంటపడి మహకొంటెగా కవ్వించు తుంటరివో
వాడి తపనలతో మగవాడి తహ తహతో
జంట పడమని వెంటపడి వేధించు తొందరవో
పెదవి అంచున ఆగినా అసలు సంగతి దాగునా
సనమ్ ఓ సనమ్ ||2|| నిను ||

ఆ ఆట ఆ ఆట జెండాపై కపిరాజుంటే

ఆ ఆట ఆ ఆట జెండాపై కపిరాజుంటే రధమాపేదెవరంట
గుండెల్లో నమ్మకముంటే బెదురెందుకు పదమంట

అల్లావుద్ధిన్ అద్భుతదీపం అవసరమే లేదంట
చల్లారని నీ సంకల్పం తోడుంటే చాలంట
అల్లదిగో ఆశలద్వీపం కళ్ళెదుటే ఉందంట
ఎల్లలనే తెంచేవేగం మేఘాలు తాకాలంట
ఆట ఆట నువు నిలబడి చూడకు ఏచోట
ఆట ఆట ఇది గెలవక తప్పని బతుకాట
ఆట ఆట అనుకుంటే బతకడమొక ఆట
ఆట ఆట కాదంటే బరువే ప్రతిపూట

ముందుగా తెలుసుకో మునిగే లోతెంత
సరదాగా సాగదు బేతా నట్టేట ఎదురీత
తెలివిగా మలుచుకో నడిచే దారంత
పులిమీద స్వారీ కూడ అలవాటు అయిపోదా
సాదించే సత్తా వుంటే సమరం ఒక సయ్యాట
తల వంచకు రావలసిందే ప్రతి విజయం నీవెంట ||అల్లా||

చెలిమితో గెలుచుకో చెలితో వలపాట
అతిలోక సుందరి రాదా జతకోరి నీవెంట
తెగువతో తేల్చుకో చెడుతో చెలగాట
జగదేక వీరుడు కూడ మనలాంటి మనిషంట
ఇటునుంచే అటు వెళ్ళారు సినిమా హీరోలంతా
దివినుంచే దిగిరాలేదు మనతారాగణమంతా
మనలోనూ ఉండుంటారు కాబోయే ఘనులంతా
పైకొస్తే జై కొడతారు అభిమానులై జనమంతా ||ఆట ఆట||

ఒలియో ఒలియో హొరెత్తావే గోదారీ ఎల్లువై

ఒలియో ఒలియో హొరెత్తావే గోదారీ ఎల్లువై తుళ్ళావిలా గట్టుజారి
ఒలియో ఒలియో ఊరేగావే సింగారీ ఇంతకీ ఏడుందే అత్తింటి దారీ
హొయ్‌నా ఏం చాందినిరా హొయ్‌నా ఏం చమక్కిదిరా
హొయ్‌నా ఏం మెరిసెనురా కన్నులారా
హయ్‌నా వెన్నెల నదిరా హయ్‌నా వన్నెల నిధిరా
హయ్‌నా ఏం కులికెనురా కన్నె తారా
ఆ కన్నుల్లో కొలువై ఉండేందుకు నీలాకాశం వాలదా
ఆ గుండెల్లో లోతుని కొలిచేందుకు సంద్రం సెలయేరైందిరా ||హొయ్‌నా||

వగలమారి నావ, హొయలు మీరినావ, అలలు ఊయలూగినావ
తళుకు చూపినావ, తలపు రేపినావ, కలల వెంట లాగినావ
సరదాగ మితిమీరి అడుగే ఏమారి సుడిలో పడదోసే అల్లరి
త్వరగా సాగాలి దరికే చేరాలి పడవా పోదాంపద ఆగకేమరీ ||హొయ్‌నా||

నీటిలోని నీడ చేతికందుతుందా
తాకిచూడు చెదిరిపోదా
గాలిలోని మేడ మాయలేడికాద
తరిమిచూడు దొరుకుతుందా
చక్కానిదానా చుక్కానికానా నీ చిక్కులన్నీ దాటగా ఓ
వద్దూ అనుకున్నా వదలను నెరజాణా
నేనే నీ జంటని రాసి ఉందిగా ||హొయ్‌నా||

ఏల్లొ ఏలొ ఏలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరోయ్

ఏల్లొ ఏలొ ఏలో ఏలో ఏలో ఏలో ఏలో ఏలోరోయ్
రేల్లొ రేల్లో రేలో రేలొ రేల్లొ రేల్లొరా

కొంగుకొంచెం భద్రం పిల్లో కొంపముంచేటట్టుండే
పొంగుకొచ్చే సింగారంలో సంగతేమయ్యుంటుందే
నాకు మాత్రం ఏం తెలుసే ఆగనంటూ నా వయసే
దూకుతుంటే నేనేం చేసేదే
మాటువేసి లాగేసే మాయలోపడి నా మనసే
మాట విన్నని మారం చేస్తోందే ||ఏల్లో||

కళ్ళు చెదిరే ఎన్నందాలో తుళ్ళుపడరా కుర్రాళ్ళు ||ఏల్లో||
గుండెలదిరే ఆనందంలో వెంటపడరా వెర్రోళ్ళు ||రెళ్ళో||
నీడపట్టున ఇన్నాళ్ళు కూడపెట్టిన అందాలు
దాచుకుంటే భారంగా ఉందే
వెచ్చచెచ్చని ఆవిరితో వచ్చి తగిలే చూపుల్లో
వేడికూడా వేడుకగా ఉందే ||ఏల్లో||

ఎప్పుడిట్టా విచ్చేసిందే వంటిమీదకి పెళ్ళీడు
ఎందుకిట్టా వీధికెక్కిందే ఎండతగలని నీ ఈడు
కాలదోషం వదిలిందో మీనమేషం కుదిరిందో
జంట చేరే దారే తెలిసిందో
పచ్చజెండా ఊగిందో పడుచుప్రాయం తూగిందో
పల్లకీ పదమంటూ పిలిచిందో ||ఏల్లో||

కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ

కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే ||కాకినాడ||
కోటప్ప కొండపై పేరంటం
సింహాద్రి గుట్టపై సాయంత్రం
వెంకన్న కరుణతో కళ్యాణం మనదేలే
సిద్దాంతి పెట్టిన సుముహుర్తం
పెద్దోళ్ళు చెప్పిన సిద్దాంత
సిగ్గంతా జారగా శ్రమదానం మనదేలే
లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే
లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే ||2||కాకినాడ||

చిన్నగుండెనే నీకు బండ చెయ్యనా
చిన్నవాడి ఆశలన్ని కట్టకట్టి కాలికే మెట్టె వేయనా
కన్నె జన్మనే నీకు కట్నమివ్వనా
తాళలేని ప్రేమ పుట్టి తాళికట్టినప్పుడే తప్పకుండ తాళమెయ్యనా
ఓ నీభామ చర్యలే ప్రారంభం నా బ్రహ్మచర్యమే గోవిందం
బ్రహ్మండమైన పరమానందం మనదేలే ||లగ్గులాహిరే||కాకినాడ||

మల్లెపూలతో ఓ మాట చెప్పనా
పిల్లగాడు గిల్లుతుంటె గొల్లు గొల్లుమంటూ ఏడవొద్దని
వెండి మువ్వతో నే విన్నవించనా
వేడిపుట్టి అల్లుకుంటే ఘల్లు ఘల్లుమంటూ
గుట్టు బైటపెట్టవొద్దని
పడకింట నిండగా నిశ్శబ్దం
పెదవుల్లో పొంగగా కిశ్శబ్దం
అటుపైన జరిగిన అణూయుద్ధం మనదేలే ||లగ్గులాహిరే||

01 July 2010

ముద్దులాట ముద్దులాట..

ముద్దులాట ముద్దులాట..
ఇద్దరాడె ముద్దులాట..మధ్యలొ ఎవడు ఒస్తే ఎంటట..

ఓ సారి సయాట..ఓ సరి పొట్లాట..
హొరేత్తె పడుచాట..ఒడెది కాదు ప్రెమాట..
అరెయ్ బెట..అరెయ్ బెట..ఆరు నూరు అవుతున్న ఆట ఆడెసుకొ
అరెయ్ బెట..బొమ్మ బొరుసు అవుతున్న ప్రెమించెసుకొ..

పాటశాల లెకున్న..పుస్తకాలు చూడకున్న..పాకులాడి నెర్చుకున్న ఆట సొకాట..
పకావాళ్ళు చూస్తున్న..పొరుగు వాళ్ళు వింటున్న..పటంటు ఆడుకున్న ఆట సుటాట..
ఎంటి ఎక్కువ చెస్తున్నావు..ఇదెం బాలెదు..
ఇంకొంచం ఎక్కువ చెయి..బాగుంటుంది.
తీయంగ పెదవాట..న్యయంగ నడుము ఆట..
మౌనంగ మనువాట..మారెది కాదు మనసాట..
అరెయ్ బెట..అరెయ్ బెట..ఆరు నూరు అవుతున్న ఆట ఆడెసుకొ
అరెయ్ బెట..బొమ్మ బొరుసు అవుతున్న ప్రెమించెసుకొ..

ఎండలెవి లెకున్న..వానలెవి రాకున్న..ఒకరిని ఒకరు కమ్ముకున ఆట గొడుగాట..
చికటెల కాకున్న..చందమమ రాకున్న..ఒకరిని ఒకరు కప్పుకున్న ఆట పడకాట..హయొ..
నువ్వు ఎప్పుడు ఇంతె..
నీతొ అసలు మాట్లడను..ఆటలు అడుతా..
ప్రె అంటె మొదలు అంట..మా అంటె చివర అంట..
ఈ రెండిటి నదిమద్య అడాలి చుడు బ్రతుకాట..
అరెయ్ బెట..అరెయ్ బెట..ఆరు నూరు అవుతున్న ఆట ఆడెసుకొ
అరెయ్ బెట..బొమ్మ బొరుసు అవుతున్న ప్రెమించెసుకొ..